వాస్తు టిప్స్ : న్యూ ఇయర్ వచ్చేస్తుంది.. ఈ తప్పులు చేస్తే ముప్పే!

Updated on: Dec 08, 2025 | 1:55 PM

నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది. దీంతో ఈ సమయంలో చాలా మంది గత సంవత్సరంలో చేసిన తప్పులు సరిదిద్దుకొన్ని మళ్లీ కొత్తగా లైఫ్ స్టార్ట్, చేసి, ఈ సంవత్సరం మొత్తం ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే కొత్త సంవత్సరంలో మీకు ఆర్థిక పురోగతి ఉండి, ఆనందంగా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని వాస్తు నియమాలను కూడా పాటించాలంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, మనం రోజూ వాడే చెప్పులు, షూస్ ఇంటిలోపల ఆర్థిక సంక్షోభానికి కారణం అవుతాయంట. కొత్త సంవత్సరంలో కొన్ని నియమాలు పాటించకపోతే, అవి కొత్త ఏడాదిలో కూడా మీకు పేదరికాన్ని తీసుకొస్తాయంట. కాగా పాదరక్షల విషయంలో కొత్త సంవత్సరంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడూ కూడా ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెప్పులు, బూట్లు కుప్పలు తెప్పలుగా ఉండకూడదు. దీని వలన ఇంటిలోకి ప్రతికూల శక్తి ప్రవేశించి,  ఆర్థిక సమస్యలను తీసుకొస్తుంది. అందువలన కొత్త ఏడాది నుంచి ఇంటి ముందు పాదరక్షలు లేకుండా చేసుకోవడం వలన మీ ఇంటిలోని సమస్యలు తొలిగిపోతాయి.

3 / 5
అలాగే ఇంటిలో చెరిగిన లేదా వాడిన పాత బూట్లు ఉండటం కామన్. అయితే వీటిని కొత్త సంవత్సరంలో ఇంటిలో ఉంచుకోకూడదంట. దీని వలన ఇంటిలో పేదరికం పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే వీటిని కొత్త ఏడాదిలో ఇంటి నుంచి తొలిగించడం మంచిది.

4 / 5
అలాగే కొంత మంది తులసి మొక్క వద్ద బూట్లు లేదా చెప్పులు పెట్టడం చేస్తుంటారు. కానీ ఇది చాలా పెద్ద వాస్తు దోషంగా పరిగణించబడుతుందంట. అందుకే వీలైనంత వరకు కొత్త ఏడాదిలో తులసి చెట్టు దగ్గర ఎలాంటి పాదరక్షలు ఉండకుండా చూసుకోవాలి.

5 / 5
అదే విధంగా కొంత మంది మంచం కింద బూట్లు పెట్టుకుంటారు. అయితే ఇలా చేయడం వలన అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఎప్పుడూ కూడా బెడ్స్ కింద చెప్పులు, బూట్లు ఉంచడం మంచిది కాదంట. న్యూ ఇయర్‌లో ఇలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్త పడాలి.