Vastu Tips: ప్లాట్ లేదా ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ప్రధాన ద్వారం, వంటగది ఎక్కడ ఉండాలో తెలుసుకోండి..

|

Sep 28, 2023 | 9:02 AM

ఆస్తిపై పెట్టుబడి పెట్టే ముందు ఆలోచనాత్మక నిర్ణయాలను తీసుకోవాలి. పొదుపులో ఎక్కువ భాగాన్ని పెట్టుబడి పెట్టబోతునందున తగిన జాగ్రత్తలు తీసుకుని ఆలోచించి లాభసాటిగా ఉండే విధంగా పెట్టుబడి పెట్టాలి. మన దేశంలో ఎక్కువగా ఆస్తిపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిని చూపిస్తారు. వాస్తు శాస్త్రం పాటించడం మన దేశంలో కొత్త విషయం కాదు. అంతేకాదు వాస్తుని చాలా మంది నమ్ముతారు. కొంతమంది వాస్తుని ట్రాష్ అంటూ కొట్టిపడేస్తారు కూడా.. అయితే వాస్తుని మీరు విశ్వసిస్తున్నట్లు అయితే ఇల్లుని లేదా ప్లాట్ ను కొనుగోలు చేయాలనీ ఆలోచిస్తుంటే.. ఈ వాస్తు టిప్స్ ని పరిగణలోకి తీసుకోండి. 

1 / 6
తూర్పు ముఖంగా ఉన్న ప్లాట్‌: శాంతియుతమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి శ్రేయస్సును సాధించడానికి తూర్పు ముఖంగా ఉన్న ప్లాట్ కొనుగోలు చేయమని చాలామంది సూచిస్తూ ఉంటారు. ప్రాపర్టీని కొనుగోలు చేసే సమయంలో ముందుగా లొకేషన్ , పరిసర సౌకర్యాలను పరిశీలించాలి. అంతేకాదు దీనితో పాటు, మీరు మీ ఇంటిని ప్లాన్ చేసేటప్పుడు వాస్తు శాస్త్ర సూత్రాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. 

2 / 6
మెయిన్ డోర్: ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ తూర్పు వైపు ఉండాలి. చాలా మంది వ్యక్తులు, నిపుణులు ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో దిశను అదృష్ట కారకంగా ప్రతిబింబిస్తుందని భావిస్తారు. అయితే వాస్తవానికి అది ప్రవేశ ద్వారం స్థానం. గృహానికి శుభాన్ని నిర్వచించే ప్రధాన అంశం. ఇంటి ప్రధాన ద్వారం  స్థానం ఎల్లప్పుడూ తూర్పు వైపు ఉండాలి.

3 / 6
వంటగది గురించి: ఇంట్లో వంటగది విషయానికి వస్తే ఇంట్లో శక్తి ప్రధాన వనరుగా పరిగణించబడుతుంది. వంటగది సరైన దిశలో ఉన్నప్పుడు ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సానుకూల వాతావరణం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ ఇల్లు తూర్పు ముఖంగా ఉన్నట్లయితే, నిపుణుల సలహాను పరిగణనలోకి తీసుకుంటే.. ఈశాన్య దిశలో వంటగదిని ఏర్పాటు చేసుకోకూడదు. ఎందుకంటే ఎలాంటి ఆరోగ్య సంబంధిత సమస్యలకు ఇది ఒక కారణంగా పరిగణించబడుతుంది. ఆగ్నేయ దిశలో వంట గది నిర్మాణం అత్యుత్తమం అని.. ఇంటిని నిర్మించే ముందు వాస్తు నిపుణుడిని సంప్రదించడం మంచిది. 

4 / 6
మెట్ల నిర్మాణం: మెట్లు ఎల్లప్పుడూ అభివృద్ధికి ఆధారం. అటువంటి పరిస్థితిలో మెట్ల ఇంట్లో సరైన స్థలంలో ఉండటం ముఖ్యం. వాస్తు ప్రకారం తూర్పు ముఖంగా ఉన్న ఇంటికి ఈశాన్య మూలలో మెట్లను నిర్మాణం చేయవద్దు. ఒక వేళ వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో ఈశాన్య దిశలో మెట్లను నిర్మాణం చేయాల్సి వస్తే.. వాస్తు శాస్త్ర నిపుణుల సలహా తీసుకుని తగిన చర్యలతో నిర్మించాలి. ఇంటికి సంబంధించిన చిన్న చిన్న  విషయాలు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి.

5 / 6
తులసి మొక్క: ఇంటిలో ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

6 / 6
 మీ ఇంట్లో తోట లేదా ఆవరణలో మొక్కలు పెంచే అలవాటు కనుక ఉంటే ఇంటి ఈశాన్య దిశలో పెద్ద మొక్కలను నాటవద్దు. అదే సమయంలో ముళ్ల మొక్కలను కూడా పెంచవద్దు. 