
వాస్తు శాస్త్రం ప్రకారం, చీపురును లక్ష్మీదేవిలా భావిస్తారు. అందువలన ఎవరు అయితే చీపురును నిత్యం పూజిస్తూ, సరైన మూలన పెడతారో వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. వారి ఇంటిలో సంపద వృద్ధి చెందుతుంది అంటారు. అయితే సరైన దిశలో చీపురు పెట్టడమే కాదు, చీపురు కొనుగోలు చేయడంలో కూడా తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలంట. కొన్ని రోజుల్లో చీపురును కొనుగోలు చేయడం దురదృష్టాన్ని తీసుకొస్తుందంట. కాగా, మనం ఇప్పుడు ఏ రోజుల్లో చీపురు కొనకూడదో చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును ఎప్పుడు పడితే అప్పుడు కొనకూడదు. చీపురు కొనడానికి కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉంది వాస్తు శాస్త్రంలో, పాత చీపురు పాడైపోయిన తర్వాత ఎప్పుడైనా సరే కొత్త చీపురును కొనుగోలు చేయాలి అంటే తప్పకుండా శని వారం రోజు మాత్రమే కొనుగోలు చేయాలంట. శని వారం చీపురు కొనడం చాలా మంచిది శుభ ప్రదం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇది ఇంటికి అదృష్టాన్ని కూడా తీసుకొస్తుందంట.

కానీ కొంత మంది శని వారం కాకుండా తమకు నచ్చిన రోజుల్లో చీపురు కొంటారు. కానీ కొంత మంది ఇవేవి పట్టించుకోకుండా, తమకు నచ్చినప్పుడు చీపురు కొనుగోలు చేయడం చేస్తుంటారు. కానీ ఇది చాలా అశుభకరం. ముఖ్యంగా ఎప్పుడూ కూడా చీపురును శుక్ల పక్షంలో కొనుగోలు చేయకూడదంట. ఇది దరిద్రాన్ని, దురదృష్టాన్ని తీసుకొస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

అంతే కాకుండా ఎప్పుడూ కూడా చీపురును మంగళవారం, శుక్రవారం కొనుగోలు చేయకూడదు. అదే విధంగా భాద్రపద మాసంలో చీపురు కొనుగోలు చేయడం మంచిది కాదు, అంతే కాకుండా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో చీపురు కొనుగోలు చేయకూడదంట. అంతే కాకుండా పాత చీపురును బయట పారేసే క్రమంలో కూడా తప్పకుండా నియమాలు పాటించాలని చెబుతున్నారు పండితులు. ఎప్పుడూ కూడా పాడైన చీపురును, బుధ, గురు, శుక్రవారం సమయంలో మాత్రమే బయటపారేయ్యాలి.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.