
చాలా మంది తమ ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. ముఖ్యంగా కొంత మంది బెడ్ రూమ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. లైటింగ్, తమ పెళ్లి ఫొటోలతో బెడ్ రూమ్ లుక్ మార్చేస్తుంటారు. ముఖ్యంగా తప్పకుండా తమ పెళ్లి ఫొటోను బెడ్ రూమ్‌లో పెట్టుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అస్సలే మంచిది కాదంట, ప్రతి ఫోటోకు ఒక సొంత శక్తి ఉంటుంది. పెళ్లైన వారు తమ ఫొటోలను ఇంటిలో, బెడ్ రూమ్‌లో పెట్టేటప్పుడు తప్పకుండా కొన్ని వాస్తు నియమాలు పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

వాస్తు ప్రకారం ఎప్పుడూ కూడా భార్య భర్తలు తమ ఫొటోలను ఇంటిలో అలంకరణగా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా సంతోషంగా, నవ్వుతూ ఉన్న ఫొటోలను లేదా ప్రేమగా ఒకరిని ఒకరు చూసుకునే ఫొటోలు మాత్రమే పెట్టాలంట. ఇలాంటివి దంపతులు మధ్య ప్రేమను మరింత బలపరుస్తుంది. అలాగే ఎప్పుడూ కూడా పాడైన ఫొటో ఫ్రేమ్ ఇంటిలో పెట్టకూడదు.

అంతే కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం దంపతులు తమకు సంబంధించిన పెళ్లి ఫొటో ఫ్రేమ్‌ను బెడ్ రూమ్‌లో మంచానికి ఎదురుగా ఉన్న గోడపై పెట్టకూడదంట. అంతే కాకుండా పూజ గది ముందు, వంట గది లేదా టాయిలెట్ బాత్రూమ్ గోడలపై కూడా అస్సలే పెళ్లి ఫొటోలను పెట్టకూడదంట. ముఖ్యంగా కొంత మంది ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా పెళ్లి ఫొటోలు పెడుతుంటారు. ఇది కూడా మంచిదికాదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఫొటోలను తప్పుడు దిశలో లేదా తప్పుడు ప్రదేశంలో పెట్టడం వలన ఇది జంటల వైవాహిక జీవితంపై చాలా ప్రభావం చూపుతుందంట. ఇది ఇద్దరి మధ్య మనస్పర్థలు తీసుకురావడం, దంపతులు మధ్య అనవసరమైన గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, భావోద్వేగం దూరం పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకే ఎప్పుడూ కూడా పెళ్లి ఫొటోలను తప్పుడు దిశలో పెట్టకూడదు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు