
ఉదయ్ పూర్ : భారతదేశంలో హోలీ పండుగను అద్భుతంగా జరుపుకునే ప్రదేశాలలో ఉదయ్ పూర్ ఒకటి. ఇక్కడ హోలీ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. అయితే మీరు కూడా మీ ప్రియమైన వారితో ఈ ప్రదేశానికి వెళ్లి, అందమైన భవనాలు, సరస్సుల మధ్య ఆనందంగా హోలీ సెలబ్రేట్ చేసుకోవచ్చును.

జైపూర్ : అద్భుతమైన ప్రదేశాల్లో జైపూర్ ఒకటి. ఇక్కడ హోలీ వేడుకలు హోటల్స్, ప్యాలెస్‌లలో చాలా ఘనంగా జరుపుతారు జానపద సంగీతం, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఎంజాయ్ చేస్తూ.. రాజస్థానీ స్పెషల్ ఫుడ్ టేస్ట్ చేస్తూ.. ఆనందంగా హోలీ వేడుకలు జరుపుకోవచ్చును.

మధుర , బృందావనం : భారత దేశంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా జరుపుకునే ప్రదేశాలలో ఈ ప్రదేశాలు ముందుంటాయి. ఈ ప్రదేశాలకు శ్రీకృష్ణుడితో దగ్గరి సంబంధం ఉండటం వలన ఇక్కడి వారు, భక్తి, భావోద్వేగాలతో చాలా ఆనందంగా హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీకి ట్రిప్ ప్లాన్ చేస్తున్న వారికి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చును.

హంపి : చాలా ప్రశాంతమైన ప్రదేశాలలో హంపి ఒకటి. ఇక్కడి వాతావరణం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. పురాతన శిథిలాలు, అందమైన చెట్లు, సరస్సులతో చాలా అందంగా ఉంటుంది ఈ ప్రదేశం. అయితే ఎవరు అయితే ప్రశాంతమైన ప్రదేశంలో హోలీ పండుగ జరుపుకోవాలి అనుకుంటున్నారో, వారికి ఇది బెస్ట్ ప్లేస్.

ఢిల్లీ : ఢిల్లీ హోలీ వేడుకలకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడి వారు చాలా ఉత్సాహంగా హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా హోలీ కి ఢిల్లీలో ఎక్కువగా డీజే ఈవెంట్స్ సంగీతం, ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు. సహజమైన ఆర్గానిక్ రంగులను ఉపయోగించి , రెయిన్ డ్యాన్స్ సెటప్‌ల మధ్య ఆనందంగా హోలీ పండుగను జారుకుంటారు.