వాస్తు టిప్స్ : ఇంట్లో మనీ ప్లాంట్ నాటుతున్నారా.. 4 విషయాలు తప్పనిసరి!

Updated on: Feb 01, 2026 | 12:28 PM

వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే తప్పనిసరిగా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంటిలో మనీ ప్లాంట్ మొక్క నాటుకుంటున్నారు. ఇది ఇంటికి ఆనందం, శ్రేయస్సు, సానుకూల శక్తిని తీసుకొస్తుందని నమ్మకం. అయితే మనీ ప్లాంట్ విషయంలో తప్పకుండా కొన్ని వాస్తు నియమాలు పాటించాలంట. అవి ఏవి అంటే?

1 / 5
మనీ ప్లాంట్ ఇంటికి అదృష్టాన్ని, ఆనందం, శ్రేయస్సును తీసుకొస్తుంది. కానీ దీనిని సరైన సమయంలో నాటినప్పుడు మాత్రమే ఇది మంచి ప్రయోజనాలను చేకూరుస్తుందంట. ఎవరు అయితే మని ప్లాంట్ నియమాలను విస్మరిస్తారో, వారు వాస్తు శాస్త్రం ప్రభావంతో అనేక సమస్యలను ఎదుర్కొంటారంట. కాగా, ఇప్పుడు మనం ఇంట్లో ఆర్థిక పురోగతి కోసం ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి. మనీ ప్లాంట్ నాటే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో చూద్దాం.

2 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ఎప్పుడూ సరైన దిశలో మాత్రమే నాటాలంట. ఇంటికి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ నాటడం వలన సకల శుభాలు కలుగుతాయంట. ఈ దిశ వినాయకుడు, శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉండటం వలన ఈ దిశలో ఎవరు అయితే మనీ ప్లాంట్ నాటుతారో వారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారంట. అఅలాగే ఇంటిలో సానుకూల శక్తి పెరుగుతుంది.

3 / 5
కొంత మంది మనీ ప్లాంట్ నాటే విషయంలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. మనీ ప్లాంట్ తీగలు నేలపై పారేలా చేస్తుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట. ఎవరి ఇంటిలోనైతే మనీ ప్లాంట్ మొక్క తీగలు నేలపై పాకుతాయో వారి ఇంటిలో సంపద తగ్గిపోవడం, ఆర్థిక సమస్యలు తలెత్తడం జరుగుతుందంట. అందుకే మనీ ప్లాంట్ తీగ ఎల్లప్పుడూ పైకి పెరిగేలా చూసుకోవాలి, దీని వలన ఇంటిలో ఆర్థిక పురోగతి ఉంటుంది.

4 / 5
ఇక చాలా మంది ఇంటి లోపల మనీ ప్లాంట్ మొక్కను నాటే సమయంలో అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. అసలు ఈ మొక్క లివింగ్ రూమ్, బాల్కనీ ఎక్కడ నాటడం మంచిదో తెలియక సతమతం అవుతారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. మనీ ప్లాంట్ మొక్కను బాల్కనీ లేదా లివింగ్ రూమ్ ఎక్కడైనా నాటినా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయంట.

5 / 5
అదే విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో మనీ ప్లాంట్ మొక్క ఉన్నప్పుడు, దాని ఆకులు ఎండిపోయినా లేదా పసుపు రంగులోకి మారినా అది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది కాబట్టి, ఎండిపోయినా లేదా వాడిపోయినా, పసుపు రంగులోకి మారి ఆకులను వెంటనే తొలిగించాలంట. దీని వలన ఎలాంటి ఆర్థిక సమస్యలు తలెత్తవు.