ఇన్నాళ్లు ఎవరూ చెప్పని నిజం.. దుర్గామాత బొట్టు కింద సాలీడు ఎందుకుంటుంది?

Updated on: Oct 17, 2026 | 12:02 PM

నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పల్లెల్లో పట్నంలో వాడ వాడ గల్లీ గల్లీలో దుర్గామత సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే ప్రతి ఒక్కరూ దుర్గామాత వద్దకు వెళ్లి బొట్టు పెట్టి పూజ చేస్తుంటారు. అయితే మీరు ఎప్పుడైనా సరిగ్గా విగ్రహాన్ని గమనించారా? ఎందుకు అనుకుంటున్నారా? విగ్రహం సరిగ్గా గమనిస్తే, అమ్మవారి నుదిటిపై పెద్ద బొట్టు కింద చిన్న సాలేడు ఉంటుంది. మరి అది ఎందుకు అలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
చాలా మంది  అమ్మవారి వద్దకు ప్రతి రోజూ వెళ్తుంటారు. కానీ అమ్మవారిని సరిగ్గా గమనించరు. కానీ గమనిస్తే దుర్గా మాత బొట్టు కింద సాలీడు కనిపిస్తుంది. చాలా మంది ఇది డిజైన్ అనుకుంటారు. కానీ నుదిటిపై సాలీడు ఉండటం వెనక పెద్ద కథ ఉందని చెబుతున్నారు పండితులు. ఇంతకీ అది ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం.

2 / 5
హిందూ తత్వశాస్త్రంలో దుర్గామాతను విశ్వ మాతగా పిలుస్తారు. ఇక పురాణాల ప్రకారం దుర్గా దేవి మహిషాసురుడితో భీకరమైన యుద్ధం చేసింది.  అలుపెరగకుండా యుద్ధం చేసి, మహిషాసురుడిని వధించింది. అయితే ఇలా యుద్ధం చేస్తున్న సమయంలో ఒక చిన్న సాలీడు అమ్మవారి నుదుటి నుంచి వచ్చి రాక్షసుడి కళ్లను కప్పేసి అతడిని బలహీనపరిచిందంట.

3 / 5
అలా యుద్ధ సమయంలో అమ్మవారికి సాలీడు సహాయం చేసింది. ఈ చిన్న జీవి అమ్మవారి విజయంలో కూడా పాలు పంచుకుంది. అందుకే దుర్గా దేవి తన విజయానికి కారణం అయిన సాలీడును గౌరవంగాతన నుదిటిపై బొట్టు కింద పెడుతుంటారంట. చెడుపై మంచి సాధించిన విజయంలో చిన్న ప్రాణి పాత్రను కూడా గుర్తించడమే దీనికి ముఖ్య కారణం.

4 / 5
బెంగాలీలో దీనిని చందనపు సాలీడు లేదా ఉల్కా అని కూడా అంటారు.  ముఖ్యంగా బెంగాల్లోని కుమార్టులి ప్రాంతంలో విగ్రహాలను తయారు చేసే శిల్పులు అమ్మవారి నుదిటిపై సాలీడును దిద్దే సంప్రదాయాన్ని వందల ఏళ్లుగా పాటిస్తున్నారంట. ఈ సాలీడు గుర్తు లేకపోతే విగ్రహం అసంపూర్ణంగా భావిస్తారంట. అంతే కాకుండా విగ్రహానికి ప్రాణం పోసే చివరి మెట్టుగా దీనిని భావిస్తారు.

5 / 5
అందుకే చాలా వరకు దర్గామాత విగ్రహాలకు ఈ సాలీడు గుర్తు ఉంటుంది. ఇదే కాకుండా సాలీడు తన గూడు తానే నిర్మించుకుంటుంది. తానే కూల్చేసుకుంటుంది. అలాగే ఈ సృష్టిని సృష్టించేది, లయం చేసేది ఆ జగన్మాతే అని చెప్పడానికి ఇది ప్రతీకగా భావిస్తారు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us