Sun Transit 2026: రాసిపెట్టుకోండి.. త్వరలో వారికి ఐశ్వర్యం, అధికారం! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

Edited By:

Updated on: Sep 08, 2026 | 12:10 PM

Sun Transit in Virgo: సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 16 వరకు రవి కన్యారాశిలో సంచరించనున్నాడు. మిత్ర క్షేత్రమైన కన్యారాశిలో రవి బలంగా ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి ఆదాయం పెరగడం, ఐశ్వర్యం కలగడం, అధికార యోగాలు పట్టడం వంటి శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. జనాకర్షణతో పాటు పేరు, ప్రఖ్యాతులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ రవి సంచారం అత్యంత అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.

1 / 7
గ్రహ రాజైన రవి గ్రహం ఈ నెల(సెప్టెంబర్) 16 నుంచి అక్టోబర్ 16 వరకు తనకు మిత్ర క్షేత్రమైన కన్యారాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతుంది. రవికి కన్యా రాశి సంచారం వల్ల బలం పెరుగుతుంది. ఈ రాశిలో ఉన్నంత వరకు కొన్ని రాశులకు ఊహించని ఆదాయాన్ని, అధికారాన్ని అనుగ్రహించడం జరుగుతుంది. ఆదాయం పెరగడం, ఐశ్వర్యం కలగడంతో పాటు తప్పకుండా జనాకర్షణను, పేరు ప్రఖ్యాతులను పెంచే అవకాశం ఉంటుంది. వృషభం, కర్కాటకం, సింహం. వృశ్చికం, ధనుస్సు, మకర రాశులకు అత్యంత అనుకూలమైన కన్యా రాశిలో రవి మరింత శక్తిమంతంగా వ్యవహరిస్తూ ఈ రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది.

2 / 7
వృషభం: ఈ రాశికి చతుర్ధాధిపతి అయిన రవి పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. ప్రతి పనినీ పట్టుదలగా సాధించుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. మరింత మంచి సంస్థలోకి మారి ఉన్నత పదవిని చేపట్టే అవకాశం కూడా ఉంది. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. షేర్లు, స్పెక్యులే షన్లు బాగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

3 / 7
కర్కాటకం: ఈ రాశికి ధనాధిపతి అయిన రవి తృతీయ స్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా అనుకూల ఫలితాలనిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఈ రాశివారి సలహాలు, సూచనల వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి చోటు చేసుకుంటుంది.

4 / 7
సింహం: రాశ్యధిపతి రవి ధన స్థానంలో సంచారం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో, రాజకీయ ప్రము ఖులతో, ఉన్నతాధికారులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా ఉన్నత స్థితి లభిస్తుంది.

5 / 7
వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతి అయిన రవి లాభ స్థానంలో ప్రవేశించడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవడం జరుగుతుంది. మరింత మంచి సంస్థలోకి మారడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఘన విజయాలు సాధిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి.

6 / 7
ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన రవి దశమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతులు కలగడం, జీతభత్యాలు పెరగడం, మరింత మంచి ఉద్యోగంలోకి మారడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆర్థికంగా మంచి అదృష్టం పడుతుంది. చదువులు, ఉద్యోగాలపరంగా విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ప్రముఖులైన వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సంతాన యోగం కలుగుతుంది.

7 / 7
మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో ప్రవేశిస్తున్న రవి వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా అదృష్టాలు కలు గుతాయి. ప్రభుత్వ ఉన్నతోద్యోగానికి సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజ యాలు సాధిస్తారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాలు సానుకూలపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us