Raja Yoga: ఉచ్ఛ స్థితితో రవి.. ఆ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!

Edited By:

Updated on: Apr 12, 2026 | 12:02 PM

ఈ నెల(ఏప్రిల్) 14 నుంచి మే నెల 14 వరకు మేష రాశిలో రవి సంచారం చేయడం జరుగుతుంది. గ్రహ రాజైన రవికి మేష రాశి ఉచ్ఛ రాశి. పాలన, ప్రభుత్వం, రాజకీయాలకు కారకుడైన రవి మేష రాశిలో సంచారం చేస్తున్నంత కాలం తనకు అనుకూలమైన రాశులకు ఏదో విధంగా రాజ యోగాలు, రాజపూజ్యాలు కలిగిస్తూనే ఉంటాడు. రవికి మేషం, మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనూ రాశులు అనుకూల రాశులు. ఈ రాశులకు చెందిన జాతకుల వారికి అధికారాన్ని ఇవ్వడంతో పాటు పాలన, ప్రభుత్వం, రాజకీయాల్లో ఊహించని అందలాలు ఎక్కిస్తాడు.

1 / 6
మేషం: గ్రహ రాజైన రవి ఈ రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండబోతున్నందువల్ల తప్పకుండా ఈ రాశివారిని ఉచ్ఛ స్థితికి, ఉన్నత స్థాయికి తీసుకువస్తాడు. రాజకీయ వర్గాల వారికి, ప్రభుత్వంలోని వారికి ఇది బాగా యోగ కాలంగా ఉంటుంది. అధికారం చేపట్టడంతో పాటు ఆదాయపరంగా కూడా అంచనాలకు మించిన అభివృద్ధి ఉంటుంది. సంపన్నులయ్యే అవకాశం కూడా ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.

2 / 6
మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో రవి గ్రహం ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారు ఒక ప్రముఖుడుగా చెలామణీ అవడం జరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారు ఒక వెలుగు వెలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నవారు విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. విజయాలు, సాఫల్యాలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి.

3 / 6
కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో ఉచ్ఛ రవి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. తప్పకుండా అధికార యోగం పడుతుంది. అధికారంతో పాటు ఆర్థికంగా కూడా ఉన్నత స్థానానికి వెళ్లడం జరుగుతుంది. రాజకీయంగా, ప్రభుత్వపరంగా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ ప్రవేశానికి సమయం బాగుంది. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం ఉంటుంది.

4 / 6
సింహం: రాశ్యధిపతి రవి భాగ్య స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, రాజకీయంగా, ప్రభుత్వపరంగా కూడా అదృష్టం పట్టడం జరుగుతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులుంటాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు అభివృద్ది బాటపడతాయి. విదేశీ ఆఫర్లు అంది వస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యం ఏర్పడుతుంది.

5 / 6
వృశ్చికం: ఈ రాశివారికి దశమాధిపతి అయిన రవి ఆరవ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. తప్పకుండా పదోన్నతి లభిస్తుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించడం మంచిది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది.

6 / 6
ధనుస్సు: ఈ రాశివారికి పంచమ స్థానంలో రవి ఉచ్ఛపట్టడం వల్ల అనేక శుభవార్తలు వినడం, ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయాల్లో ప్రవేశించడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. సామాజికంగా ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆస్తిపాస్తులు, షేర్లు బాగా కలిసి వచ్చే సూచనలున్నాయి.

Follow Us