Telugu Astrology: రవి నీచత్వంతో వీరికి కష్టనష్టాలే..! ఆర్థిక విషయాల్లో జాగ్రత్త

Edited By:

Updated on: Oct 09, 2026 | 1:14 PM

అధికారానికి, రాజకీయ ప్రాబల్యానికి, తండ్రికి, ఉన్నత పదవులకు, ఆరోగ్యానికి, సంపదకు కారకుడైన గ్రహ రాజు రవి ఈ నెల(అక్టోబర్) 17న తులా రాశిలో ప్రవేశించి నీచబడడం జరుగుతోంది. రవికి ఈ నీచత్వం నవంబర్ 16 వరకు కొనసాగుతుంది. మేషం, వృషభం, సింహం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశుల వారు వృత్తి, ఉద్యోగాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. అన్ని రాశులకూ వర్తించే విషయం ఏమిటంటే అధికారులతో, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం పఠించడం చాలా అవసరం.

1 / 7
మేషం: ఈ రాశికి పంచమాధిపతి అయిన రవి సప్తమ స్థానంలో నీచబడడం  వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా తగ్గుతుంది. రావలసిన పదోన్నతులు రాకపోవచ్చు. అధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో పొరపాట్లు జరిగే సూచనలున్నాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, కొద్దిగా డబ్బు నష్టపోవడంతో పాటు వైద్య ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. పెళ్లి ప్రయ త్నాలు ఇబ్బంది పెడతాయి. బంధువుల్లో విమర్శలకు, అవమానాలకు గురవడం జరుగుతుంది.

2 / 7
వృషభం: ఈ రాశికి చతుర్థ (సుఖసంతోషాలు) స్థానాధిపతి అయిన రవి షష్ట స్థానంలో నీచబడడం వల్ల మనశ్శాంతి లోపించే అవకాశం ఎక్కువగా ఉంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సంబంధ మైన చిక్కుల బారిన పడే సూచనలున్నాయి. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. కుటుంబ కలహాలకు అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు, వివాదాలు బాగా ఇబ్బంది పెడతాయి. తల్లి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. గృహ, వాహన ప్రయత్నాలకు విఘాతాలు ఏర్పడతాయి.

3 / 7
సింహం: రాశ్యధిపతి రవి తృతీయ స్థానంలో నీచబడడం వల్ల ఏ ప్రయత్నమూ ఒక పట్టాన కలిసి రాదు. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల వల్ల నష్టపోవడం లేదా ప్రయాణాల్లో విలు వైన వస్తువులు, పత్రాలు కోల్పోవడం జరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు తలెత్తుతాయి. రావలసిన డబ్బు ఒకపట్టాన చేతికి అందక ఇబ్బంది పడతారు. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. పురోగతి ఉండకపోవచ్చు.

4 / 7
కన్య: ఈ రాశికి వ్యయాధిపతి అయిన రవి ధన స్థానంలో నీచబడడం వల్ల ఆదాయ వృద్ధికి ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందకపోవచ్చు. ఆర్థికంగా సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఇష్టమైన బంధుమిత్రులు దూరమవుతారు. అధికారులతో వాగ్వాదాలు తలెత్తే అవకాశం ఉంది.

5 / 7
తుల: ఈ రాశిలో లాభ స్థానాధిపతి రవి నీచబడడం ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. రావలసిన పదోన్నతులు  ఆగిపోయే అవకాశం ఉంది. ఆదాయం పెరిగినప్పటికీ చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఉంటుంది. వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల వల్ల నష్టపో వడం జరుగుతుంది. అధికారులతో అపార్థాలు తలెత్తుతాయి. మీ పనితీరుతో అధికారులు సంతృప్తి  చెందరు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దుర్వార్తలు ఎక్కువగా వింటారు.

6 / 7
వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతిగా  అత్యంత శుభుడైన రవి వ్యయ స్థానంలో నీచబడడం వల్ల ఉద్యోగం మారాల్సి రావడం, ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ కావడం, పదోన్నతి లభించకపోవడం, ప్రాధాన్యం తగ్గడం వంటివి జరగవచ్చు. బంధుమిత్రులు అపనిందలు వేసే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయ త్నాలు ఆశించిన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉండదు. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో బాగా శ్రమ ఉంటుంది.

7 / 7
మకరం: ఈ రాశికి దశమ స్థానంలో రవి నీచబడడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. పదోన్నతులు ఆగిపోయే అవకాశం ఉంది. రాజపూజ్యాల కంటే అవమానాలు ఎక్కువగా ఉంటాయి. అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు పెరుగుతాయి. తండ్రితో విభేదాలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందే అవకాశం ఉండదు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us