
వృషభ రాశి : సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయడం వలన వృషభ రాశిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ముందు చూపుతో పనులు ప్రారంభించడమే కాకుండా పూర్తి చేస్తారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే అప్పుల బాధతో సతమతం అవుతున్నారో వారు అనేక సమస్యల నుంచి తప్పుకుంటారు. ముఖ్యంగా వ్యవసాయం చేసే వారికి ఈ సమయం అద్భుతంగా కలిసి వస్తుంది.

సింహ రాశి :సూర్యుడు మీ రాశి అధిపతి. మృగశిరలో సూర్య బలం వల్ల పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో, వారికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది.

మకర రాశి : మకర రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. సూర్య సంచారం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు అన్నీ కూడా సమయానుగుణంగా పూర్తి చేసుకుంటారు. ఊహించని విధంగా ఆదాయం డబుల్ అవుతుంది. ఎవరు అయితే అప్పుల బాధలతో సతమతం అవుతున్నారో, వారు వాటి నుంచి త్వరగా బయటపడతారు. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారిపై సూర్యుడి దృష్టి పడుతుంది. దూర ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. వీటి వలన లాభాలు పొందుతారు. అలాగే ఎవరు అయితే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారికి ఇది బెస్ట్ సమయం. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు