
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటిలో పాము ఫొటో ఉండటం చాలా మంచిది. దీని వలన ఎన్నో ప్రయోజనాల ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇంటిలో పాము ఫొటో పెట్టుకోవడం చాలా శుభప్రదం. కానీ ఈ ఫొటో ఇంటిలో ఉన్నప్పుడు కొన్ని నియమాలు పాటించడమే కాకుండా, తప్పకుండా దానిని సరైన దిశలో మాత్రమే పెట్టాలంట. తప్పుడు దిశలో పాము ఫొటో పెట్టడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

కాగా, ఇప్పుడు మనం వాస్తు శాస్త్రం ప్రకారం పాము ఫొటోను ఇంటిలో ఎక్కడ పెట్టాలో చూసేద్దాం. పాముకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా శివుడు పామును మెడలో ధరించారు. అంతే కాకుండా, కృష్ణుడు పాముపై నాట్యం చేయడం ఇలా సనాతన ధర్మంలో పాముకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందువలన ఇంటిలో పాము ఫొటో ఉండటం చాలా మంచిదంట. ముఖ్యంగా వాసు శాస్త్రం ప్రకారం పాము ఫొటోను ఇంటిలో తూర్పు లేదా ఉత్తర దిశలో పెట్టడం చాలా మంచిదంట. ఇది శుభ ఫలితాలను ఇస్తుంది.

ఇంటిలో పాము ఫొటో ఉండటం వలన ప్రతి కూల శక్తులు ఇంటిలోకి రాకుండా తొలిగిపోతాయి. అంతే కాకుండా ఇది చెడు దృష్టి నుంచి రక్షణ కల్పిస్తుందంట, కెరీర్ పరంగా, ఆర్థకపరంగా ఆరోగ్య పరంగా ఇలా అన్ని విధాలుగా మీకు పాము ఫొటో కలిసి వస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఎవరు అయితే ఏ పని చేపట్టినా అది మధ్యలోనే ఆగిపోతుందో, పనులు త్వరగా పూర్తి అవ్వడం లేదో వారు పాము ఫొటోను ఇంటిలో పెట్టుకోవడం చాలా శుభ సూచకం అని చెబుతున్నారు పండితులు.

అయితే ఇంటిలో పాము ఫొటో తప్పుడు దిశలో ఉంటే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. ముఖ్యంగా కలలో పాము వెంబడించినట్లు అనిపించడం, పదే పదే పాములు కనిపించడం, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందంట. అంతే కాకుండా ఇంటిలో గంభీరంగా, పెద్దగా ఉండే పాముల ఫోటోలను పెట్టుకోకూడదు, ఇది భయాన్ని కలిగించడమే కాకుండా, ప్రతి కూల శక్తికి కారణం అవుతుందంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.