
సెప్టెంబర్ నెల 9వ నెంబర్ దీని రాడిక్స్ నెంబర్ 9 అవుతుంది. ఇక ఈ నెంబర్‌కు అధిపతి కుజుడు. అందువలన వీరిలో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఈ నెంబర్ మంత్‌లో జన్మించిన వారికి ఎరుపు రంగు చాలా అదృష్టాన్ని తీసుకొస్తుందని చెబుతున్నారు నిపుణులు.

అదే విధంగా ఈ మాసంలో పుట్టిన పిల్లలు చాలా ప్రత్యేకమైన వారు. తల్లిదండ్రులు వీరి అల్లరి నవ్వు, చూసి ఆనందంగా మురిసిపోతారంట. చిన్న తనం నుంచే వీరిలో గొప్ప భావాలు ఉంటాయని చెబుతున్నారు పండితులు. అందుకే వీరి అందికంటే చాలా ప్రత్యేకమైనవారిగా ఉంటారంట. వీరు మంచి రూపం, రంగును కలిగి ఉంటారు. అందరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.

ఇక సెప్టెంబర్ నెలలో జన్మించిన వారు చాలా కష్టపడే తత్వం ఉన్నవారు. వీరు ఏ పనిని అయినా సరే చాలా ఇష్టంగా చేస్తారంట. అంతే కాకుండా వీరిని కాపాడేది కూడా ఇదే అంటున్నారు పండితులు. వీరు ఎంత కష్టపడతారో దానికి తగిన ఫలితాలను పొందుతారంట. వీరి మంచి సామార్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ ఫలితాలను ఆశించకుండా పని చేస్తారు. కానీ గొప్ప గొప్ప ఫలితాలను అందుకుంటారు.

వీరు మంచి భావోద్వేగాలను కలిగి ఉంటారు. తల్లిదండ్రులపై అమితమైన ప్రేమను కనబరుస్తారు. ప్రతి ఒక్కరినీ ఇష్టపడతారు. తమను నమ్మిన వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. వీరికి స్నేహితులు ఎక్కువా, ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి ఉంటారు. ఎప్పుడూ ఆనందంగా, నవ్వుతూ ఉండటానికి ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తారు.

కెరీర్ పరంగా కూడా వీరు చాలా బెటర్‌గా ఉంటారు. ప్రతి పనిలో ఉత్తమమైన ప్రతిభ కనబరుస్తారు. తెలివితేటల్లో చాలా ముందు ఉంటారు. అంతే కాకుండా వీరు భవిష్యత్తులో గొప్ప రాజకీయనాయకులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు అయ్యే ఛాన్స్ ఉన్నదంట.