September 2026 Horoscope: ఈ రాశుల వారికి ఉద్యోగం, పెళ్లి, ఆర్థిక లాభాలు..మీ రాశికి ఎలా ఉందంటే..?

Edited By:

Updated on: Aug 31, 2026 | 2:03 PM

మాస ఫలాలు (సెప్టెంబర్ 1-30, 2026): మేష రాశి వారికి ఈ నెలలో జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ నెల ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చాలా బాగుంటుంది. ప్రధమార్థం సీదా సాదాగా గడిచిపోతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సెప్టెంబర్ మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): సెప్టెంబర్ నెలంతా గురువు ఉచ్ఛ స్థితిలో ఒంటరిగా చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల  ఈ రాశివారి జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో శుక్రుడు కూడా అనుకలంగా మారుతున్నందువల్ల శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మనసు లోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఏ ప్రయ త్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. ఆదాయం బాగానే కానీ, విందు వినోదాలు, విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆశలు వదిలేసుకున్న బాకీలు చేతికి అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవి తం హ్యాపీగా సాగిపోతుంది. ఆదిత్య హృదయ పఠనం వల్ల విజయాలు, సాఫల్యాలు కలుగుతాయి.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ రాశివారికి నెల ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చాలా బాగుంటుంది. ప్రధమార్థం సీదా సాదాగా గడిచిపోతుంది. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు జోరందు కుంటాయి. లాభాలు, రాబడి తగ్గే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో ఆదాయ సంబంధమైన ప్రయ త్నాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా మారతాయి. అయితే, నెలంతా ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. అనవసర ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు, కార్యకలాపాలు పూర్తవుతాయి. పిల్లల వల్ల కుటుంబంలో చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలకు ఆశిం చిన స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదాల విషయంలో శుభవార్త వినడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తరచూ శివార్చన చేయడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ధన స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు ఈ నెలంతా పూర్తి స్థాయిలో శుభ యోగాలనివ్వడం జరుగుతుంది. శుక్ర, బుధ, శనీశ్వరులు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నెల రోజుల పాటు జీవితం ఆశించిన విధంగా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల మీద విరివిగా ఖర్చు చేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి వీలుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది. ఆరోగ్యం అను కూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాలు  అనుకూలంగా సాగిపోతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ నెల ద్వితీయార్థం నుంచి ఈ రాశివారికి చాలా బాగుంటుంది. రవి, కుజులతో పాటు శుక్రుడి అనుకూలత కూడా పెరగడం వల్ల రాజయోగాలు కలుగుతాయి. ఏ రంగంలో ఉన్నవారైనా విజ యాలు, సాఫల్యాలతో పురోగతి చెందుతారు. ప్రథమార్థంలో ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉన్న ప్పటికీ, ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన ప్రయత్నాలు చాలావరకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరు గుతుంది. కొత్త బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక బాధ్యతలను ఎవరికీ అప్పగించవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపో తుంది. సుందరకాండ పారాయణం చేయడం వల్ల నెల ప్రథమార్థం కూడా మెరుగ్గా ఉండవచ్చు.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ నెల అష్టమ శని ప్రభావం కాస్తంత ఎక్కువగా ఉండబోతోంది. ధన స్థానంలో  కేతువు వల్ల ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి. నెల ద్వితీయార్థంలో ధన స్థానంలోకి రాబోతున్న రవి, బుధ గ్రహాల వల్ల వృత్తి, ఉద్యోగాల్లో బాగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాల్లో కొత్త ప్రయత్నాలకు, కార్యక్రమాలకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే పక్షంలో ముఖ్యమైన వ్యవహా రాలు, పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయడం వల్ల ఈ రాశివారికి ప్రతికూల ఫలితాలు బాగా తగ్గుతాయి.

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ధన స్థానంలో ధనాధిపతి శుక్రుడు, లాభ స్థానంలో గురువు, నెల ద్వితీయార్థం నుంచి లాభ స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల జీవితాన్ని మంచి మలుపు తిరుగుతుంది. శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ తెలివితేటలు, శక్తిసామర్థ్యాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. శుభ కార్యాలు, దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. పిల్లలు ఆశించిన విధంగా వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. బంధుమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. తరచూ దుర్గా దేవిని అర్చిం చడం, సుబ్రహ్మణ్యాష్టకం చదువు కోవడం వల్ల రాహు కేతువుల దోషం బాగా తగ్గిపోతుంది.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడి స్వస్థాన ప్రవేశం, దశమస్థానంలో గురువు, లాభ స్థానంలో రవి సంచారం వల్ల ఈ రాశివారికి ఈ నెలంతా అనేక శుభ ఫలితాలు, శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ఆదరణ, ప్రోత్సాహం వృద్ధి చెందు తాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ నిర్ణ యాలు, ఆలోచనలు కార్యరూపంలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగంలో మార్పులకు, ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయపరంగా ప్రతి ప్రయత్నం అనుకూలి స్తుంది. జీవిత భాగస్వామికి కూడా వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తరచూ విష్ణు సహస్ర నామ స్తోత్ర పఠనం వల్ల ముఖ్యమైన దోషాలు తొలగిపోతాయి.

8 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): సెప్టెంబర్ మొదటి వారంలో లాభ స్థానంలో బుధుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం, భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వంటి కారణాల వల్ల ఈ నెలలో కొన్ని ముఖ్యమైన విజయాలు, సాఫల్యాలు చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం సక్సెస్ అవుతాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేసినా సఫలమవుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉంటున్న పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక స్థిర త్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. కోరుకున్న ఉద్యోగం లభి స్తుంది. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.

9 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): అష్టమ స్థానంలో ఉన్న గురువు ఉచ్ఛ స్థితిలో ఒంటరిగా సంచారం చేయడం వల్ల ఈ నెలంతా కొద్దిగా అనుకూలంగా సాగిపోతుంది. శుక్రుడు లాభ స్థానంలోనూ, బుధుడు ఉచ్ఛ స్థితిలో దశమ స్థానంలోనూ ప్రవేశించడం వల్ల ఉద్యోగ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించడం, మరింత మంచి ఉద్యోగంలోకి మారడం వంటివి జరు గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఆర్థిక స్థిరత్వం కోసం కృషి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన లాభాలనిస్తాయి. అనుకోని ఖర్చులతో కాస్తంత ఇబ్బంది పడతారు.  స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. తరచూ గణ పతి స్తోత్రం చదువుకోవడం వల్ల అడ్డంకులు, ఆటంకాలను తేలికగా అధిగమించే అవకాశం ఉంది.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ నెలంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. శనీశ్వరుడు, గురువు, బుధ, శుక్రులు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఆదాయం పెరిగి, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమి స్తాయి. ఉద్యోగ జీవితంలో పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం అందే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆదాయ మార్గాలు విస్తరి స్తాయి. ఆఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన కార్యకలాపాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆశించిన శుభవార్తలు వింటారు. ఏ పని తలపెట్టినా సంతృప్తికరంగా పూర్తవుతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. తరచూ శివార్చన చేయించడం వల్ల మరిన్ని సానుకూల ఫలితాలకు అవకాశం ఉంటుంది.

11 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ నెల ప్రథమార్థంలో రాశులు మారుతున్న శుక్రుడు, బుధ  గ్రహాల వల్ల ఈ రాశివారి జీవితంలో తప్పకుండా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు దృష్టి పడడం వల్ల ఈ రాశిలో ఉన్న రాహువు కూడా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. విదేశీయానానికి అవకాశాలు కలుగుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు, చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. చిన్న ప్రయత్నంతో మంచి లాభాలను పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. దుర్గాదేవి స్తోత్రం పారాయణ చేయడం వల్ల ఘన విజయాలు కలుగుతాయి.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు ఉచ్ఛస్థితితో పాటు, ఈ నెల మొదటి వారంలో సప్తమ స్థానంలో బుధుడు కూడా ఉచ్ఛ స్థితికి వస్తున్నందువల్ల ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ప్రతి పనీ నెరవేరుతుంది. టెన్షన్లు, శ్రమ బాగా తగ్గే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. గురు, బుధుల బలం వల్ల ఆదాయానికి లోటుం డదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా చాలా వరకు సఫలం అవుతాయి. వ్యాపారాలు పర వాలేదనిపిస్తాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నించేందుకు ఇది మంచి సమయం. నిరుద్యోగు లకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. లలితా సహస్ర నామం పఠించడం వల్ల సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us