
అయితే చాలా వరకు పురుషులు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. స్త్రీలు ఇలా నమస్కారం చేయడం మంచిది కాదు అని పండితులు, పెద్దలు చెబుతుంటారు. కాగా, ఇప్పుడు మనం దీనికి గల కారణాలు ఏంటి. మహిళలు ఎందుకు సాష్టాంగ నమస్కారం చేయకూడదో మనం పూర్తిగా తెలుసుకుందాం.

సాష్టాంగ నమస్కారం అంటే? దేవుడి ముందు లేదా పెద్దల ముందు నేలపై పూర్తిగా తన శరీరాన్ని తాకేలా చేసి, సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఇలా నమస్కారం చేయడం వెనుక చాలా అర్థం ఉంది. దేవుడు లేదా పెద్ద వారి ముందు తమ అహాన్ని ఆ దేవుని పాదాల చెంత పూర్తిగా వదిలి పెడుతున్నాను అనే దానిని ఇది సూచిస్తుంది. అందుకే చాలా మంది సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు.

భారతీయ సంప్రదాయంలో మహిళలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అంటారు. దీనికి ముఖ్య కారణం గర్భాశం, వక్షస్థలం సృష్టి జీవనాధారానికి మూలం , పోషణకు ప్రతీక కాబట్టి అవి నేలను తాక కూడదు అని చెబుతుంటారు.అందుకే స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయడం కంటే, మోకాళ్లపై సాష్టాంగ నమస్కారం చేసి, పంచాంగ నమస్కారం చేయడం మంచిది అని చెబుతుంటారు.

హిందూ గ్రంథాల ప్రకారం, స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయడం నిషిధించారు. సనాతన సంప్రదాయంలో స్త్రీలు మాతృత్వానికి ప్రతిరూపంగా, దేవతా స్వరూపంగా పూజిచడం చేస్తుంటారు. అయితే, స్త్రీ గర్భానికి ఒక కొత్త ప్రాణానికి జీవం ఇచ్చి, తనలో మోసి దానిని ప్రపంచంలోకి తీసుకరాగల సామర్థ్యం ఉంటుంది. అందుకే ఆ గర్భాశయం నేలను తాకకూడదు అని చెబుతుంటారు.

అంతే కాకుండా తల్లి నవజాత శిశువులకు పాలను అందించి, పోషణ చేకూరుస్తుంది. అందుకే వక్ష స్థలం కూడా నేలను తాకకూడదు అని మహిళలు సాష్టాంగ నమస్కారం చేయడం నిషేధించడం జరిగింది. సృష్టికి ప్రాణధారమైన భూమిని, సృష్టిలో కీలక భాగాలైన ఈ గర్భాశయం, వక్షోజాలు నేరుగా నేలను తాకడం వలన కలిగే ఒత్తిడి, పవిత్రతను నివారించడానికి స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయడం నిషేధించడం జరిగింది. అంతే కాకుండా ఇలా స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేస్తే అది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా తగ్గిస్తుందంట.