
ఇక ఇది కొన్ని సార్లు శుభ ఫలితాలను ఇస్తే మరికొన్ని సార్లు అనేక ఇబ్బందులకు కారణం అవుతుంది. అయితే ఈ ఏలినాటి శని సమయంలో చాలా మంది శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ సమయంలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అసలు ఏలినాటి శని సమయంలో బంగారం ధరించాలా? ధరించ వద్దా అనే డౌట్ ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏలినాటి శని సమయంలో బంగారం లేదా బంగారంతో చేసిన వస్తువులు ధరించడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. బంగారం అనేది సూర్యుడికి సంబంధించిన లోహం. అయితే శాస్త్రాల ప్రకారం శని సూర్యుడి కుమారుడు. వీరి మధ్య తీవ్రమైన శతృత్వం ఉంటుంది కాబట్టి, ఏలినాటి శని సమయంలో బంగారం ధరించకూడదంట.

అంతే కాకుండా ఒక వ్యక్తి జీవితంలో సూర్యుడు బలహీన స్థానంలో ఉంటే మాత్రమే, బంగారు లోహాలను ధరించాలి. వీలైనంత వరకు ఏలినాటి శని సమయంలో బంగారు ఆభరణాలు ధరించకపోవడమే చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా ఏలినాటి శని సమయంలో బంగారు ఆభరణాలు ధరించడం వలన చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

ఏలినాటి శని సమయంలో బంగారం ధరించడం వలన శని దేవుడికి కోపం ఎక్కువగా వస్తుందంట. అంతే కాకుండా, ఇది మీ జీవితం ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా బంగారు లోహాలు ధరించినప్పుడు సూర్యినిచే శక్తి ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ఇది తప్పుడు దిశలోకి మళ్లించడం వలన మీరు మీ జీవితంలో అనేక ఆటంకాలు ఎదుర్కునే ఛాన్స్ ఉన్నదంట.

అందువలన ఏ రాశుల వారు అయితే ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్నారో వారు వీలైనంత వరకు బంగారు ఆభరణాలు ధరించకపోవడమే మంచిది. వీలైనంత వరకు ఈ సమయంలో ఇనుప ఉంగరం ధరించడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రతి కూల ప్రభావాలు కూడా తగ్గిపోతాయంట.