
శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన వారిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు పండితులు. కాగా, ఇప్పుడు మనం శ్రీ కృష్ణుడు జన్మించిన నక్షత్రంలో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం.

రోహిణి నక్షత్రంలో జన్మించిన వారిపై చంద్రుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరు చాలా ఆకర్షణీయంగా, అందంగా, భావోద్వేగ పరంగా అన్ని విధాలుగా చాలా సృజనాత్మకతను కలిగి ఉంటారు. అంతే కాకుండా వీరికి కళలు, సంగీతం, వంటి వాటిపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీరు వారి చుట్టూ ఉన్నవారి కంటే కాస్త భిన్నంగా కనిపించడమే కాకుండా అనర్గళంగా మాట్లాడుతారు.

అందుకే 27 నక్షత్రాలలో రోహిణి నక్షత్రం చాలా ప్రత్యేకమైనది. అంతే కాకుండా పవిత్రమైనది అంటారు. అంతే కాకుండా ఈ నక్షత్రంలో జన్మించిన వారు మాట్లాడే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందంట. మర్యాదపూర్వకంగా, మృదువుగా మాట్లాడుతుంటారు. అంతే కాకుండా వీరికి అందరినీ ఆకట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి కళ్లలో ప్రత్యేకమైన మెరుపు కనిపిస్తుంది.

అంతే కాకుండా వీరు మాట్లాడే విధానం కూడా అందరికంటే భిన్నంగా చాలా అందంగా ఉంటుంది. వీరు అందరిపై ఎక్కువ ప్రేమను కురిపిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు కళాత్మకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అంతే కాకుండా అందరి దృష్ణిని కూడా ఆకర్షిస్తారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు