
వృషభం: లాభ స్థానంలో ఉన్న శనీశ్వరుడిని కుజ, శుక్రులు వీక్షించడం వల్ల ఈ రాశివారు మంచి అదృష్ట వంతులయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి, అనేక విధాలుగా ఆదాయ వృద్ధికి, పేరు ప్రఖ్యాతులకు బాగా అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. వ్యాపారాల్లో జోరు బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న శనిని కుజ, శుక్రులు చూడడం వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో రాజయోగాలు, ధన యోగాలు ఎక్కువగా కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికాభివృద్ధికి బాగా అవకాశం ఉంది. ఆస్తి లాభాలు, భూలాభాలు కలిగే అవకాశం కూడా ఉంది. ఆస్తి విలువ పెరుగు తుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యో గులకు ఆశించిన విదేశీ ఆఫర్లు అందుతాయి. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది.

సింహం: అష్టమ స్థానంలో ఉన్న శనిని సింహ రాశి నుంచి కుజుడు, కన్యారాశి నుంచి శుక్రుడు వీక్షించడం వల్ల ఈ రాశివారికి అష్టమ శని దోషం చాలావరకు తగ్గుతుంది. ఆదాయపరంగా, ఉద్యోగపరంగా తప్పకుండా వీరికి తప్పకుండా అదృష్టం తలుపు తడుతుంది. విదేశీయానానికి సంబంధించిన అవకాశాలు పెరుగుతాయి. విదేశాల్లో స్థిరత్వం సంపాదించుకుంటారు. పిల్లలకు ఉన్నత విద్యల్లో అవకాశాలు లభిస్తాయి. వారసత్వ సంపద కలిసి వస్తుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది.

తుల రాశి: ఈ రాశికి ఆరవ స్థానంలో ఉన్న శనిని రాశ్యధిపతి శుక్రుడు, లాభ స్థానంలో ఉన్న కుజుడు వీక్షించడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా విపరీత రాజయోగాలు కలుగుతాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అప్రయత్న ధనలాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వీరిదే పైచేయిగా ఉంటుంది. లాటరీలు, షేర్లు, వడ్డీ వ్యాపారం, ఆర్థిక లావాదేవీల వంటి వాటి ద్వారా ధన ప్రాప్తికి అవకాశం ఉంది. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది.

వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న శనిని రాశ్యధిపతి కుజుడు, సప్తమాధిపతి శుక్రుడు వీక్షించడం వల్ల అనేక మార్గాల ద్వారా ధనార్జనకు అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ది చెందే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆస్తి వివాదం సమసిపోతుంది.

మకరం: తృతీయ స్థానంలో ఉన్న రాశ్యధిపతిని శుక్ర, కుజులు చూడడం వల్ల ఈ రాశివారికి రెండు మూడు సార్లు ధన యోగాలు పడతాయి. సంపద బాగా వృద్ధి చెందుతుంది. మాటకు విలువ పెరుగు తుంది. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.