వచ్చే రెండు వారాలు వీరికి తిరుగే ఉండదు..! ఆకస్మిక ధన లాభాలకు ఛాన్స్

Edited By:

Updated on: Aug 19, 2026 | 5:20 PM

ప్రస్తుతం రాహు, కుజుల మధ్య నక్షత్ర పరివర్తన జరుగుతోంది. కుజుడికి చెందిన ధనిష్ఠా నక్షత్రంలో రాహువు, రాహువుకు చెందిన ఆర్ద్రా నక్షత్రంలో కుజుడు సెప్టెంబర్ మొదటి వారం వరకు సంచారం చేయడం జరుగుతుంది. మొండి పట్టుదలకు, ధైర్య సాహసాలకు, పోరాటాలకు ప్రతీక అయిన కుజుడు మిథున రాశిలో, పట్టువదలని విక్రమార్కుడైన రాహువు కుంభ రాశిలో నక్షత్ర పరివర్తనతో సంచారం చేయడం వల్ల మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి భూమి, పిత్రార్జితం, సంపద, ఆకస్మిక ధన లాభం వంటి విషయాల్లో అదృష్టం పడుతుంది.

1 / 6
మేషం: ఆదాయ వృద్ధికి, అధికారానికి గట్టి ప్రయత్నాలు సాగించే ఈ రాశివారికి కుజ, రాహువుల నక్షత్ర పరివర్తన బాగా అనుకూల ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. రాశ్యధిపతి కుజుడికి, లాభ స్థానంలో ఉన్న రాహువుకు లింక్ ఏర్పడడం వల్ల వీరికి మహాభాగ్య యోగం కలిగే అవకాశం ఉంది. ఉద్యో గంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. భూ సంబంధమైన ఆస్తి కలిసి వస్తుంది. స్థలం కొనే అవకాశం ఉంది. ఇల్లు, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి.

2 / 6
మిథునం: పట్టుదలకు, గుండె ధైర్యానికి మారుపేరైన ఈ రాశిలో సంచారం చేస్తున్న కుజుడికి భాగ్య స్థానంలో ఉన్న రాహువుతో నక్షత్ర పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి విజయాలు, సాఫల్యాలు ఎక్కు వగా కలుగుతాయి. తనకు సక్రమంగా రావలసినదాన్ని పోరాడైనా సాధించుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. రావలసిన డబ్బు, రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా వసూలవుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది.

3 / 6
సింహం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు లాభ స్థానంలో ఉండి, సప్తమ స్థానంలో ఉన్న రాహువుతో నక్షత్ర పరివర్తన చెందడం వల్ల ఈ రాశివారిలోని నాయకత్వ లక్షణాలకు, కలుపుకునిపోయే తత్వానికి సార్థకత లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఆస్తి వివాదం సానుకూ లంగా పరిష్కారం కావడం, లాభదాయక పరిచయాలు ఏర్పడడం, రావలసిన డబ్బును గట్టి ప్రయ త్నంతో వసూలు చేసుకోవడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి.

4 / 6
తుల: ఈ రాశివారిలో ఈ నక్షత్ర పరివర్తన వల్ల వ్యాపార దక్షత, దూరదృష్టి బాగా వృద్ధి చెందుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి కలిసి వస్తుంది. నిరుద్యోగులకు భారీ జీత భత్యాలతో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.

5 / 6
ధనుస్సు: యాంబిషన్ ఎక్కువగా ఉండే ఈ రాశివారిలో ఈ నక్షత్ర పరివర్తనతో పోరాటతత్వం పెరుగుతుంది. సప్తమ స్థానంలో ఉన్న కుజుడికి, తృతీయ స్థానంలో ఉన్న రాహువుకు నక్షత్ర పరివర్తన జరగడం వల్ల ఏ రంగంలో ఉన్నప్పటికీ ఉన్నత పదవులు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు జోరందుకుంటాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది.

6 / 6
కుంభం: ఈ రాశిలో ఉన్న రాహువుకు, పంచమ స్థానంలో ఉన్న కుజుడికి నక్షత్ర పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారి సమర్థతకు, శ్రమపడే తత్వానికి గుర్తింపు లభిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. అధికార యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ప్రతిభా పాటవాలు, ప్రత్యేక నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us