
సంఖ్యా శాస్త్రం పుట్టిన తేదీ(సంఖ్య)ని బట్టి వ్యక్తుల జీవిత విశేషాలను తెలియజేసే శాస్త్రం. పుట్టిన తేదీ వ్యక్తుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియజేస్తుంది. కొంతమంది పెద్దగా కష్టపడకుండానే ధనవంతులు అవుతున్నట్లు మనకు అనిపిస్తుంది. అలాంటి వారి జీవితంలో లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉన్నట్లు భావిస్తారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం, దీనికి ఒక కారణం వారి జన్మ సంఖ్య అని నమ్మకం. పుట్టిన తేదీ ఆధారంగా లెక్కించే ఈ సంఖ్య వ్యక్తి స్వభావం, విధి, అలాగే ఆర్థిక ప్రగతిపై ప్రభావం చూపుతుందని చెబుతారు.

1, 10, 19, 28 తేదీలలో జన్మించినవారు.. ఈ తేదీలలో పుట్టినవారు సూర్య ప్రభావంలో ఉంటారని చెబుతారు. వీరికి నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, రిస్క్ తీసుకునే ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం, ఉద్యోగం, రాజకీయాలు వంటి ఏ రంగంలోనైనా ఎదిగి, పేరు, ప్రతిష్ట, సంపదలను సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

3, 12, 21, 30 తేదీలలో జన్మించినవారు.. వీరంతా జ్ఞానం, తెలివితేటలు, అదృష్టం కలిగినవారిగా పరిగణించబడతారు. విద్య, బోధన లేదా మేధోరంగాల్లో వీరు విశేషంగా రాణిస్తారు. జీవితంలో మంచి అవకాశాలు వీరికి సులభంగా లభిస్తాయి. ఆర్థికంగా కూడా స్థిరంగా ఎదగగల సామర్థ్యం వీరిలో ఉంటుంది.

6, 15, 24 తేదీలలో జన్మించినవారు.. ఈ తేదీలలో జన్మించినవారు శుక్ర ప్రభావంలో ఉంటారని అంటారు. శుక్రుడు సుఖం, ఐశ్వర్యం, విలాసానికి ప్రతీకగా భావిస్తారు. అందువల్ల వీరిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని నమ్మకం. వీరు ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుని, సౌఖ్యవంతమైన జీవితాన్ని గడపగలరు.

సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని సంఖ్యలు ఉన్నవారు.. అదృష్టవంతులుగా కనిపించినా, నిజమైన విజయానికి కఠోర శ్రమ, సరైన నిర్ణయాలు, పట్టుదల అనేవి తప్పనిసరి. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సంఖ్యా శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)