
సంఖ్యాశాస్త్రం ప్రకారం, నెబర్ 5 తేదీలో జన్మించిన వారు చాలా మొండి స్వభావం కలవారు. వీరు ఎప్పుడూ చాలా ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటారు. అంతే కాకుండా అన్ని విషయాల్లో వీరిదే పై చేయి ఉండాలి అనుకుంటారు. అయితే ఈ తేదీలో జన్మించిన వారు వివాహం తర్వాత తన భర్తను ఓ ఆట ఆడిస్తారంట. తన భర్తను చేతి వేళ్లపై ఆడిస్తారంట.

అదే విధంగా ఏ నెలలో అయినా సరే 14 వ తేదీన పుట్టిన అమ్మాయిలు కూడా చాలా దూకుడు స్వభావం కలవారు. అంతే కాకుండా వీరు చాలా ధైర్యవంతులు. అయితే ఈ తేదీన పుట్టిన వారు ఎవ్వరి మాట వినరంట. ముఖ్యంగా భర్త మాట అస్సలే వినరు. వీరు తాము అనుకున్నది సాధించుకుంటారు. భర్తతో అన్ని పనులు చేయించుకుంటారు.

అదే విధంగా 24వ తేదీన జన్మించిన వారు చాలా సృజనాత్మక కలిగిన వ్యక్తులు వీరు చాలా తెలివైన వార. అంతే కాకుండా పెళ్లి తర్వాత వీరు తమ భర్త ప్రతి మాటను పాటిస్తూ, భర్తలను అదుపులో పెట్టుకుంటారు. అంతే కాకుండా వీరు ఉన్నత స్థితిలో ఉంటారు.

ఎవరు అయితే నెలతో సంబంధం లేకుండా 29వ తేదీలో జన్మిస్తారో వారు కూడా చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు. ప్రతి పనిని చాలా సులభంగా చేస్తారు. అన్ని రంగాల్లో ముందుంటారు. అలాగే ఇంటిలో కూడా వీరు తమ పెత్తనమే చెలాయిస్తారు. భర్తను తమ చేతుల్లో పెట్టుకొని పనులు చేస్తారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు