
ఇంటిలో మనీ ప్లాంట్ ఉన్నా కూడా అదృష్టం కలిసి రాకపోతే, ఆ మొక్క ఉన్న కుండీలో మెరిసే ఈ ఒక్క వస్తువు పెడితే సరిపోతుదంట. అది ఇంటికి అదృష్టం తీసుక రావడమే కాకుండా, ఆర్థిక పురోగతికి దోహద పడుతుందంట. ఇంటిలో సంపద వృద్ధి చెందేలా చేస్తుందంట.

ప్రతి ఒక్కరూ ఆర్థికంగా కలిసి రావాలని ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటారు. కానీ అది నాటిన వెంటనే మీకు అదృష్టాన్ని తీసుకొని రాదు, దానిలో ఉన్న శక్తిని బయటకు తీసుకొస్తేనే అది ఆర్థిక వృద్ధికి దోహద పడుతుందంట. అయితే ఫెంగ్ షుయ్ , క్రిస్టల్ థెరఫీ ప్రకారం, మనీ ప్లాంట్ మొక్కలో ఒక మెరిసే వస్తువును పెట్టడం చాలా మంచిదంట, ఇది డబ్బును మీ వైపు ఆకర్షిస్తుందని వారు చెబుతున్నారు.

ఇంతకీ అది ఏమి అనుకుంటున్నారా? పైరైట్ క్రిస్టల్. దీనిని ఫూల్స్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఇది అచ్చం బంగారం కనిపిస్తుంది. దగ దగా మెరుస్తుంది. అయితే ఎవరు అయితే తమ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటున్నారో, వారు ఈ పైరైట్ క్రిస్టల్‌ను మనీ ప్లాట్ ఉన్న కుండీలో పెట్టాంట. దీని వలన మనీ ప్లాంట్ మొక్క సానుకూలతను పెంచడమే కాకుండా, సంపద వృద్ధి చెందేలా చేస్తుంది.

అయితే దీనిని కొనుగోలు చేసిన తర్వాత మీరు మీ ప్రధాన ద్వారం వద్ద మట్టి కుండీలో మనీ ప్లాంట్ మొక్క నాటినట్లు అయితే దాని వేరు వద్ద, మట్టి ఉపరితలంపై దీనిని పెట్టాలి. ఒక వేళ నీటి సీసాలో మనీ ప్లాంట్ పెంచుకున్నట్లు అయితే, దానిని సీసాకు దగ్గరగా పెట్టాలంట. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొస్తుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు