Financial Gains: బుధుడికి నీచభంగం.. ఆ రాశుల వారు కోటీశ్వరులయ్యే ఛాన్స్..!

Edited By:

Updated on: Apr 06, 2026 | 5:51 PM

Money Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధ గ్రహం మదుపులు, పెట్టుబడులు, బ్యాంకులు, వ్యాపారాలు, షేర్లు, స్పెక్యులేషన్లకు కారకుడు. ఈ నెల (ఏప్రిల్) 11న మీన రాశిలో ప్రవేశిస్తున్న ఈ బుధ గ్రహం ఈ నెల 30న ఆ రాశి నుంచి నిష్క్రమిస్తుంది. బుధుడికి మీన రాశి నీచ స్థానమైనప్పటికీ, ధన కారకుడైన గురువుతో పరివర్తన చెందడం వల్ల నీచభంగం కలిగింది. ఫలితంగా బుధుడు ఆకస్మిక ధన ప్రాప్తిని, అప్రయత్న ధన లాభాన్ని కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అత్యధికంగా లాభాలనిస్తాయి. వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారు బాగా లబ్ధి పొందుతారు.

1 / 6
వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో బుధుడి సంచారం వల్ల ఈ రాశివారికి ఎటువంటి పెట్టుబడి పెట్టినా, ఎంత పెట్టుబడి పెట్టినా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి సమ యం అనుకూలంగా ఉంది. ఉద్యోగులు కూడా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల తప్పకుండా అంచనాలను మించిన లాభాలు పొందుతారు. భూములు, ఆస్తులు, బంగారం మీద పెట్టుబడులు పెట్టడం కూడా బాగా లాభించే అవకాశం ఉంది.

2 / 6
మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు దశమ స్థానమైన మీన రాశిలో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడంతో పాటు షేర్లు బాగా లాభించే అవకాశం కూడా ఉంది. మదుపులు, పెట్టుబడులు బాగా లాభిస్తాయి. వడ్డీ వ్యాపారాలు, పందాలు కూడా లాభాల వర్షం కురిపిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు పొందడం కూడా జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు సక్సెస్ అవుతాయి.

3 / 6
కన్య: రాశ్యధిపతి బుధుడు సప్తమ స్థానంలో నీచభంగం చెందడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల వర్షం కురిపిస్తాయి. జీవిత భాగస్వామి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం పెరగడంతో పాటు, అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల కూడా బాగా లాభాలు పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది.

4 / 6
వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడికి నీచభంగం కలిగినందువల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎటువంటి పెట్టుబడి పెట్టినా, ఏ విధంగా మదుపు చేసినా లాభాల పంట పండుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. కొద్ది శ్రమతో అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తుల మీద పెట్టుబడులు పెట్టడం మంచిది.

5 / 6
మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో భాగ్యాధిపతి బుధుడు నీచభంగం పొందడం, రాశ్యధిపతి శనితో యుతి చెందడం వల్ల వీరు అతి తక్కువ కాలంలో కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాల్లోనూ, అదనపు ఆదాయం మీదా పెట్టే పెట్టుబడులు తప్పకుండా కనక వర్షం కురిపి స్తాయి. ఎటువంటి వ్యాపారం తలపెట్టినా కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి.

6 / 6
కుంభం: ఈ రాశికి ధన స్థానంలో బుధ గ్రహానికి నీచభంగం జరగడం వల్ల ఆస్తిపాస్తుల మీదా, రియల్ ఎస్టేట్ మీదా పెట్టుబడులు పెట్టడం వల్ల అపార ధన లాభం కలుగుతుంది. ఇతరులతో కలిసి వ్యాపారాలు చేయడం వల్ల లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, బంగారం, భూమి, లాటరీల ద్వారా ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. అదనపు ఆదాయాన్ని వీలైనంతగా మదుపు చేయడం వల్ల సంపన్నులయ్యే అవకాశం ఉంది.

Follow Us