Lucky Zodiacs: నక్షత్ర పరివర్తనతో వీరికి అదృష్టమే అదృష్టం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

Edited By:

Updated on: Oct 17, 2026 | 3:54 PM

Mercury-Jupiter Nakshatra Exchange: జ్యోతిషశాస్త్రం ప్రకారం రాశి పరివర్తనకు ఎంత ప్రాధాన్యం ఉందో నక్షత్ర పరివర్తనకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. ఒకరి నక్షత్రంలో మరొకరు సంచారం చేస్తున్నప్పుడు కూడా ధన యోగాలు, రాజయోగాలు, శుభ యోగాలు కలగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ నెలాఖరు వరకు గురువుకు చెందిన విశాఖ నక్షత్రంలో బుధుడు, బుధుడికి చెందిన ఆశ్లేష నక్షత్రంలో గురువు సంచారం చేయడం జరుగుతోంది. బుధ, గురు గ్రహాల మధ్య ఎటువంటి సంబంధం ఏర్పడినా అది అదృష్టాలను కలిగిస్తుంది. ముఖ్యంగా మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది.

1 / 6
మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్న గురువుకు, సప్తమ స్థానంలో ఉన్న బుధుడికి మధ్య నక్షత్ర పరివర్తన జరిగినందువల్ల ఈ నెల అక్టోబర్ 31 వరకు ఈ రాశివారికి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. అనుకున్న పనులన్నీ అవరోధాలు లేకుండా పూర్తి కావడం, ప్రతి ప్రయత్నమూ నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఆదాయం అనేక రెట్లు పెరిగి, ఆర్థికంగా సంతృప్తికర స్థాయికి చేరుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారయోగం పడుతుంది. వ్యాపారాలు బాగా పురోగమిస్తాయి.

2 / 6
మిథునం: ఈ రాశికి పంచమంలో ఉన్న రాశ్యధిపతి బుధుడికి, ధన స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుకు మధ్య నక్షత్ర పరివర్తన జరగడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో సమర్థతకు, ప్రతిభకు మంచి గుర్తింపు లభించి అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరి ష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది.

3 / 6
కర్కాటకం: ఈ రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు ఆశ్లేష నక్షత్రంలో, చతుర్థ స్థానంలో ఉన్న బుధుడు విశాఖ నక్షత్రంలో సంచారం చేస్తున్నందువల్ల విలువైన ఆస్తిపాస్తులు లభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో రాజ యోగాలు కలుగుతాయి. ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలకు దశ తిరు గుతుంది. నిరుద్యోగులకు మంచి విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

4 / 6
కన్య: రాశ్యధిపతి బుధుడు గురు నక్షత్రంలో, గురువు రాశ్యధిపతి నక్షత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు, వివాదాల నుంచి క్రమంగా బయటపడడం జరుగుతుంది. ఆస్తిపా స్తులు లభిస్తాయి. ఉద్యోగపరంగా విపరీత రాజయోగం కలుగుతుంది. ఉద్యోగంలో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది.

5 / 6
తుల: ఈ రాశిలో ఉన్న బుధుడికి, దశమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుకు మధ్య నక్షత్ర పరివ ర్తన జరగడం వల్ల ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విశేషమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత పదవుల్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు లభిస్తాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది.

6 / 6
మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న గురువుకు, దశమ స్థానంలో ఉన్న బుధుడికి మధ్య నక్షత్ర పరివర్తన జరగడం ఊహించని రాజయోగాలు కలుగుతాయి. రాజపూజ్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాల్ని మించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సంస్థ నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఆర్థికంగా బాగా ఉన్నత స్థానానికి ఎదుగుతారు.

Loading...
Unable to load recommendations.
Follow Us