Mars Transit: మీన రాశిలో కుజుడు.. వారికి ఆకస్మిక ధన లాభం, అధికార లాభం..!

Edited By:

Updated on: Apr 10, 2026 | 11:32 AM

Kuja Gochar 2026: ప్రస్తుతం తనకు మిత్ర క్షేత్రమైన మీన రాశిలో సంచారం చేస్తున్న కుజుడు మే 11 వరకు అదే రాశిలో కొనసాగడం జరుగుతుంది. కుజుడు మీన రాశిలో సంచారం చేస్తున్న సమయంలో ఆకస్మిక శుభ పరిణామాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆకస్మిక ధన లాభం, ఆకస్మిక అధికార లాభం వంటివి తప్పకుండా కలుగుతాయి. ఈ సంచారంలో కుజుడు అనుకూలంగా ఉన్న రాశుల వారికి లాభదాయక, ఉపయోగకర ఆలోచనలను కూడా ఇవ్వడం జరుగుతుంది. వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఊహించని రీతిలో ఆదాయం వృద్ధి చెందడంతో పాటు, అధికార యోగం కూడా పడుతుంది.

1 / 6
వృషభం: ఈ రాశివారికి అనుకోకుండా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంది. ఈ రాశివారికి షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నైపుణ్యం కలుగుతుంది. ఆదాయ వృద్ధి పట్ల, అధికా రాన్ని సంపాదించుకోవడం పట్ల కోరికలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ రాశివారికి సమీప భవిష్యత్తులో తప్పకుండా విదేశీ సంపాదన యోగం పడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

2 / 6
మిథునం: ఈ రాశికి చెందిన ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలతో సహా అనేక అవకాశాలు, ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది. పని చేసే సంస్థలో అధికార యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. వ్యాపారాలు, వాణిజ్యాల్లో లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి. ఆస్తి లాభం, భూలాభం కలిగే అవకాశం ఉంది. పిత్రార్జితం లభిస్తుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది.

3 / 6
కర్కాటకం: విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలన్న ఈ రాశివారి కోరిక నెరవేరుతుంది. ఎక్కువగా విదేశీ అవకాశాలకు ప్రయత్నించడం మంచిది. సమయం బాగా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించడానికి కూడా అవకాశం ఉంది. మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. గృహ యోగం కలుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఎంత పోటీ ఉన్నప్పటికీ ఈ రాశి ఉద్యోగులకు తప్పకుండా  పదోన్నతులు లభిస్తాయి.

4 / 6
వృశ్చికం: ఈ రాశికి మనసులోని కోరికలు చాలావరకు తీరే సమయం ఇది. ఇష్టమైన ఉద్యోగం లభిస్తుంది. ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహ రిస్తే అంత మంచిది. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. షేర్లు బాగా లాభిస్తాయి.

5 / 6
మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న కుజుడి వల్ల అనేక విషయాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. ముఖ్యంగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

6 / 6
మీనం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు ఈ రాశిలోనే సంచారం చేయడం వల్ల రాజపూజ్యాలు, రాజ యోగాలు కలుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, పదోన్నతులు కలగడం వంటివి జరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అదనపు ఆదాయ మార్గాలన్నీ అంచనాలకు మించిన లాభాలనిస్తాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగవుతుంది.

Follow Us