సింహ రాశిలోకి కుజుడు.. వీరు కోరుకున్నది జరగడం ఖాయం

Updated on: Oct 29, 2026 | 3:24 PM

కుజ గ్రహాన్ని అగ్ని గ్రహం అని కూడా అంటారు. అయితే త్వరలో కుజుడు సింహ రాశిలోకి సంచారం చేయనున్నాడు. రెండు గ్రహాలు కూడా అగ్ని తత్వానికి సంబంధించినవి. దీంతో అపారమైన శక్తి వస్తుంది. ఇది 12 రాశులపై ప్రభావం చూపుతుంది. అయితే ఇది ఏ రాశుల వారికి ఎక్కువ లాభాలను తీసుకొస్తుందో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
కుజుడు  సింహ రాశిలోకి సంచారం చేయడం వలన నాలుగు రాశుల వారికి కోరుకున్నది జరుగుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇలా అన్ని విధాలుగా వీరికి కలిసి రానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే, మేష రాశి , సింహ రాశి , కుంభ రాశి, మీన రాశి .

2 / 5
మేష రాశి : మేష రాశి వారికి అధిపతి కుజుడు. అందువలన కుజ సంచారం వీరికి చాలా ప్రయోజనకరం. ఎవరు అయితే చాలా రోజుల నుంచి భూమి లేదా ఇల్లు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఈ రాశుల వారు ఈ సమయంలో ప్రమోషన్ అందుకునే ఛాన్స్ ఉంది. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అధికారుల మద్ధతు లభిస్తుంది.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి కుజ గ్రహ సంచారం వలన వ్యాపార పరంగా కలిసి వస్తుంది. సమాజంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఉద్యోగ బదిలీ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది కలిసొచ్చే సమయంగా చెప్పాలి. అంతే కాకుండా  భార్య భర్తలు కలిసి ఆస్తి కొనే యోగం ఉంది.

4 / 5
సింహ రాశి : మీ రాశిలోకే కుజుడు వస్తున్నాడు కాబట్టి మీకు ఇది సింహ గర్జన లాంటి సమయం. మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఆస్తివివాదాలు పరిష్కారం అవుతాయి. దాంపత్య జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అన్ని విధాలుగా మీకు ఇది చాలా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవాలి.

5 / 5
మీన రాశి : మీన రాశి వారికి సింహ రాశిలోకి కుజ గ్రహ సంచారం అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. అప్పుల బాధ నుండి బయటపడతారు, పాత అప్పు తీర్చేస్తారు. ఉద్యోగంలో మీ మీద కుట్ర చేసిన వారు పక్కకు తప్పుకుంటారు, మీకు ప్రమోషన్ దక్కుతుంది. ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక అనారోగ్యం తగ్గుముఖం పడుతుంది, జీర్ణ సమస్యలు పోతాయి. పోటీ పరీక్షలు, క్రీడలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఇది గోల్డెన్ టైం.

Loading...
Unable to load recommendations.
Follow Us