Maha Bhagya Yoga: మిథునంలో శుభ గ్రహాలు…ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..!

Edited By:

Updated on: May 12, 2026 | 8:10 PM

Lucky Zodiac Signs: గురు, శుక్రుల దృష్టి పడినా, ఈ రెండు గ్రహాలతో యుతి జరిగినా చంద్రుడు అత్యంత శుభ గ్రహంగా మారిపోయి అనేక విధాలుగా అదృష్టాలను కలిగిస్తాడు. ఈ నెల(మే) 18, 19, 20 తేదీల్లో మిథున రాశిలో గురు, శుక్రులతో చంద్రుడు యుతి చెందుతున్నందువల్ల కొన్ని రాశుల వారికి అక్షరాలా పట్టిందల్లా బంగారం అవుతుంది. మిథున రాశిలో ఈ మూడు గ్రహాలు కలవడం మహా భాగ్య యోగంగా గుర్తింపు పొందింది. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి అనేక విధాలుగా అదృష్టం తిరిగే అవకాశం ఉంది. ఈ మూడు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలు నూరు శాతం ఫలితాలనిస్తాయి.

1 / 6
వృషభం: ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో గురు, చంద్రులు కలవడం వల్ల మనసులోని  కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సత్ఫలితాలనిస్తుంది. ఆత్మ విశ్వాసం, మానసిక స్థయిర్యం వృద్ది చెందుతాయి. ఒకటి రెండు ధన యోగాలు కలుగుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం కలుగుతుంది. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. తల్లి నుంచి ఊహించని సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లలు చదువుల్లో బాగా పైకి వస్తారు.

2 / 6
మిథునం: ఐశ్వర్య కారకుడైన చంద్రుడు గురు, శుక్రులతో కలిసి ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల  అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. కొత్త ప్రాజెక్టులు, కార్యక్రమాలు చేపడతారు. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

3 / 6
సింహం: ఈ రాశికి లాభ స్థానంలో గురు, చంద్ర, శుక్రుల యుతి వల్ల ఈ రాశివారు కొన్ని ముఖ్యమైన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని పూర్తిగా పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాట వాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది.

4 / 6
తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో గురు, చంద్రులు కలవడం వల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది.

5 / 6
ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో రాశ్యధిపతి గురువుతో శుక్ర, చంద్రులు యుతి చెందడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో కూడా జీతభత్యాలు పెరగడం, అధికార యోగం పట్టడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. సామాజికంగా కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు చేస్తారు. ఆదాయ వృద్ధికి ఎలాంటి ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. సమస్యలు తగ్గుముఖం పడతాయి.

6 / 6
కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో గురు, శుక్ర, చంద్రుల యుతి వల్ల ఈ రాశివారికి మనసులోని కోరి కలు చాలావరకు నెరవేరుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి, పుణ్య క్షేత్రాల్ని సందర్శిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని పురోగతి సాధిస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

Follow Us