మార్చి 3న చంద్ర గ్రహణం.. ఈ రాశులకు పదోన్నతులు, ఆదాయ వృద్ధి..!

Edited By:

Updated on: Feb 20, 2026 | 5:53 PM

Lunar Eclipse 2026: మార్చి 3వ తేదీన కుంభ రాశిలోని శతభిష నక్షత్రంలో చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం దేశమంతా కనిపించే అవకాశం లేనప్పటికీ జ్యోతిషశాస్త్రం ప్రకారం, దీని ప్రభావం 3, 4 తేదీల్లో కొన్ని రాశుల మీద సానుకూల ఫలితాలను చూపించే అవకాశం ఉంది. కుంభ రాశిలో రవి, రాహువులు, సింహ రాశిలో చంద్ర, కేతువులు కలుస్తుండడం వల్ల ఈ గ్రహణం ఏర్పడుతోంది. ఈ రవి, రాహువులు బుధ, కుజులతో కలిసి ఉండడంతో పాటు దీన్ని గురువు కూడా వీక్షిస్తున్నందువల్ల ఈ గ్రహణం కొన్ని రాశులకు యోగదాయకం కాబోతోంది. మేషం, వృషభం, కన్య, ధనుస్సు, మకరం, కుంభ రాశుల వారికి గ్రహణ ప్రభావం వల్ల పదోన్నతులు, అత్యధిక రాబడి, ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది.

1 / 6
మేషం: ఈ రాశికి లాభ స్థానంలో, పైగా రాహు నక్షత్రమైన శతభిషంలో చంద్ర గ్రహణం ఏర్పడుతున్నందు వల్ల ధన సంపాదన మీద శ్రద్ధాసక్తులు, వ్యామోహం బాగా పెరుగుతాయి. ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. సీనియర్లను కాదని ఆకస్మిక పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఈ రెండు రోజులు కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది.

2 / 6
వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో గ్రహణం చోటు చేసుకుంటున్నందువల్ల విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనూహ్యంగా ఫలించే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. శత్రుబాధ, పోటీదార్ల బెడద బాగా తగ్గుతాయి. శత్రువులు మిత్రులుగా మారడం జరుగుతుంది. బంధువుల ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు లభిస్తాయి.

3 / 6
కన్య: ఈ రాశివారికి షష్ట స్థానంలో గ్రహణం పడుతున్నందువల్ల ఈ రాశివారికి ఎక్కువగా అనుకూల ఫలితాలే అనుభవానికి వస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలను మరింత కొనసాగించడం మంచిది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థిక ఒప్పందాలు విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశివారికి తృతీయ స్థానంలో గ్రహణం పట్టడం వల్ల, ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. సునాయాసంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా అవకాశాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. అధికారుల నమ్మకాన్ని, అభిమానాన్ని చూరగొంటారు. కొందరు స్నేహితులను వృద్ధిలోకి తీసుకువస్తారు. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజ పూజ్యాలు కలుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.

5 / 6
మకరం: ఈ రాశికి ధన స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. రావలసిన సొమ్ము సునాయాసంగా చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు పూర్తిగా వసూలవుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో సానుకూల స్పందన లభిస్తుంది. కొత్త ప్రయత్నాలు చేపట్టడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

6 / 6
కుంభం: ఈ రాశిలో రవి, రాహువులు, సింహ రాశిలో చంద్ర, కేతువుల కలయిక జరుగుతున్నందు వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ రెండు రోజులు ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల అనుకున్నవన్నీ సాధించే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు, కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. అనారోగ్యాల నుంచి బయట పడతారు. ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు నూరు శాతం ఫలితాలనిస్తాయి. పెన్షన్లు, బీమా సొమ్ము, వారసత్వపు ఆస్తి వంటివి చేతికి అందుతాయి.

Follow Us