
అయితే అతి త్వరలో కార్తీక పౌర్ణమి సమయంలో బుధుడు తుల రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇప్పటికి అదే రాశిలో శుక్ర గ్రహం ఉండటం వలన తుల, శుక్ర గ్రహాల కలయికతో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. దీని వలన కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి : మేష రాశి వారికి నవంబర్ 23 నుంచి డిసెంబర్ 2 వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. అంతే కాకుండా ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా డబుల్ అవుతుంది. ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఎవరు అయితే పనులు పూర్తి చేయకుండా ఉన్నారో, వారు తమ పనులను త్వరగా సరైన సమయానికి పూర్తి చేసుకుంటారు.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ ఇవి చాలా లాభదాయకంగా ఉంటాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం కూడా గతం కంటే ఎక్కువగా రెట్టింపు అవుతుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఎవరు అయితే చాలా రోజుల నుంచి శారీరకంగా, మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారో, వారు వాటి నుంచి త్వరగా బయటపడతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా మీరు ఊహించని విధంగా రెట్టింపు అవుతుంది.

మకర రాశి : మకర రాశి వారికి సమాజంలో ప్రత్యేక స్థానం లభిస్తుంది. విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవుతారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. ఆధ్యాత్మికంగా కలిసి వస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు, రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించుకుంటారు.