ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకాలు

Updated on: Mar 22, 2026 | 11:02 PM

Lakshmi Panchami: ఈ నెల మార్చి 23న లక్ష్మీ పంచమి వచ్చింది. చైత్ర మాసంలో వచ్చే ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలు తీరి, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. సంవత్సరం అంతా ధనానికి లోటు ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు పూజ విధానం, పరిహారాలు ఈ వీడియోలో వివరించబడ్డాయి.

1 / 6
చైత్ర మాసంలో వచ్చే పంచమి రోజున లక్ష్మీ పంచమిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి భూమిపైకి దిగి వచ్చి తన భక్తులను ఆశీర్వదిస్తుందని ప్రతీతి. ముఖ్యంగా మార్చి 23వ తేదీ సోమవారం నాడు వచ్చే ఈ లక్ష్మీ పంచమి అదనపు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి, ఆర్థికంగా గొప్ప స్థాయికి ఎదుగుతారని, సంవత్సరం పొడవునా ధనానికి లోటు ఉండదని నమ్మకం. ఈ పవిత్ర దినాన లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు పాటించాల్సిన పూజా విధానం, నియమాల గురించి తెలుసుకుందాం.

చైత్ర మాసంలో వచ్చే పంచమి రోజున లక్ష్మీ పంచమిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి భూమిపైకి దిగి వచ్చి తన భక్తులను ఆశీర్వదిస్తుందని ప్రతీతి. ముఖ్యంగా మార్చి 23వ తేదీ సోమవారం నాడు వచ్చే ఈ లక్ష్మీ పంచమి అదనపు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి, ఆర్థికంగా గొప్ప స్థాయికి ఎదుగుతారని, సంవత్సరం పొడవునా ధనానికి లోటు ఉండదని నమ్మకం. ఈ పవిత్ర దినాన లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు పాటించాల్సిన పూజా విధానం, నియమాల గురించి తెలుసుకుందాం.

2 / 6

పూజా విధానం, నియమాలు: 

లక్ష్మీ పంచమి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి, ఇల్లంతా శుభ్రం చేసుకుని, తలస్నానం ఆచరించాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, బియ్యప్పిండితో అందమైన ముగ్గులు వేయాలి. ఇలా ఇంటి గుమ్మాన్ని అలంకరించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని విశ్వాసం. పూజ కోసం లక్ష్మీదేవి చిత్రపటం, రాగి కలశం, అక్షింతలు, పూలు, పండ్లు, కొబ్బరికాయ వంటి వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఈ రోజున కొత్తగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని కొని తెచ్చుకోవడం శుభప్రదం. పూజ గదిలో ఒక చెక్క పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి, లక్ష్మీదేవి ఫోటోని ఉంచి, గులాబీ పూలతో అలంకరించాలి. రాగి లేదా ఇత్తడి కలశంలో నీళ్లు పోసి, పసుపు కుంకుమలు వేసి, పైన కొబ్బరికాయను ఉంచాలి. ముందుగా గణపతిని పూజించి, ఆ తర్వాత "ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ ఆవు నెయ్యితో వెలిగించిన రెండు దీపాల సమక్షంలో లక్ష్మీదేవికి అక్షింతలు, పుష్పాలు సమర్పించాలి. నైవేద్యంగా పాలు పొంగించి చేసిన పరమాన్నం నివేదించడం వల్ల కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి.

పూజా విధానం, నియమాలు: లక్ష్మీ పంచమి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి, ఇల్లంతా శుభ్రం చేసుకుని, తలస్నానం ఆచరించాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, బియ్యప్పిండితో అందమైన ముగ్గులు వేయాలి. ఇలా ఇంటి గుమ్మాన్ని అలంకరించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని విశ్వాసం. పూజ కోసం లక్ష్మీదేవి చిత్రపటం, రాగి కలశం, అక్షింతలు, పూలు, పండ్లు, కొబ్బరికాయ వంటి వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఈ రోజున కొత్తగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని కొని తెచ్చుకోవడం శుభప్రదం. పూజ గదిలో ఒక చెక్క పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి, లక్ష్మీదేవి ఫోటోని ఉంచి, గులాబీ పూలతో అలంకరించాలి. రాగి లేదా ఇత్తడి కలశంలో నీళ్లు పోసి, పసుపు కుంకుమలు వేసి, పైన కొబ్బరికాయను ఉంచాలి. ముందుగా గణపతిని పూజించి, ఆ తర్వాత "ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ ఆవు నెయ్యితో వెలిగించిన రెండు దీపాల సమక్షంలో లక్ష్మీదేవికి అక్షింతలు, పుష్పాలు సమర్పించాలి. నైవేద్యంగా పాలు పొంగించి చేసిన పరమాన్నం నివేదించడం వల్ల కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి.

3 / 6
ప్రత్యేక పరిహారాలు, నమ్మకాలు: అప్పుల నుండి విముక్తి: 
అప్పుల సమస్యలతో బాధపడేవారు నెయ్యి దీపంలో రెండు లవంగాలు వేయాలి. అలాగే లక్ష్మీదేవి ఫోటోకి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకుంటే క్రమంగా అప్పులన్నీ తీరిపోతాయి.

ఆకస్మిక ధన లాభం: ఆకస్మిక ధనాన్ని కోరుకునేవారు తమలపాకు పైన కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి.

స్త్రీలకు: ఇంట్లో పూజ చేసే ఆడవారు తమ మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుని లక్ష్మీదేవిని పూజిస్తే భర్త ఆయుష్షు, ఆదాయం పెరుగుతాయి.

ప్రత్యేక పరిహారాలు, నమ్మకాలు: అప్పుల నుండి విముక్తి: అప్పుల సమస్యలతో బాధపడేవారు నెయ్యి దీపంలో రెండు లవంగాలు వేయాలి. అలాగే లక్ష్మీదేవి ఫోటోకి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకుంటే క్రమంగా అప్పులన్నీ తీరిపోతాయి. ఆకస్మిక ధన లాభం: ఆకస్మిక ధనాన్ని కోరుకునేవారు తమలపాకు పైన కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. స్త్రీలకు: ఇంట్లో పూజ చేసే ఆడవారు తమ మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుని లక్ష్మీదేవిని పూజిస్తే భర్త ఆయుష్షు, ఆదాయం పెరుగుతాయి.

4 / 6

ధనధాన్య వృద్ధి: ఈ పంచమి రోజున పేదలకు బియ్యం దానం చేస్తే సంవత్సరం అంతా ధనధాన్యాలకు కొరత ఏర్పడదు.

గోమాత పూజ: గోమాతలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి, గోవుకు పచ్చిగడ్డి తినిపించి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి కోరిన వరాలను ప్రసాదిస్తుంది.

కొత్త కొనుగోళ్లు: పిసిరంత బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, అక్షరాభ్యాసం, కొత్త వాహనాలు కొనుగోలు చేయడం, గృహప్రవేశాలు చేయడం శుభప్రదం.

ధనధాన్య వృద్ధి: ఈ పంచమి రోజున పేదలకు బియ్యం దానం చేస్తే సంవత్సరం అంతా ధనధాన్యాలకు కొరత ఏర్పడదు. గోమాత పూజ: గోమాతలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి, గోవుకు పచ్చిగడ్డి తినిపించి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి కోరిన వరాలను ప్రసాదిస్తుంది. కొత్త కొనుగోళ్లు: పిసిరంత బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, అక్షరాభ్యాసం, కొత్త వాహనాలు కొనుగోలు చేయడం, గృహప్రవేశాలు చేయడం శుభప్రదం.

5 / 6
సమస్యల నివారణకు: రాళ్ల ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి, ఉప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకుని, ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ముట్టుకోవడం వల్ల శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ కటాక్షం లభిస్తాయి. తులసిని పూజించి, పచ్చిపాలు పోస్తే ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. పూజ గదిలో ఐదు పసుపు కొమ్ములను లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి, తర్వాత బీరువాలో లేదా పర్సులో పెట్టుకుంటే శ్రీమంతులు అవుతారని నమ్మకం.

లక్ష్మీదేవి పాదముద్రలు: ఇంటి ప్రవేశ ద్వారం నుండి పూజ గది వరకు బియ్యప్పిండితో లక్ష్మీదేవి పాదముద్రలు వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి స్థిర నివాసం ఉంటుంది.

సాయంత్రం దీపారాధన: సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు శుభ్రం చేసుకుని గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించడం వల్ల అష్ట దరిద్రాలు తొలగి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది.

సమస్యల నివారణకు: రాళ్ల ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి, ఉప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకుని, ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ముట్టుకోవడం వల్ల శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ కటాక్షం లభిస్తాయి. తులసిని పూజించి, పచ్చిపాలు పోస్తే ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. పూజ గదిలో ఐదు పసుపు కొమ్ములను లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి, తర్వాత బీరువాలో లేదా పర్సులో పెట్టుకుంటే శ్రీమంతులు అవుతారని నమ్మకం. లక్ష్మీదేవి పాదముద్రలు: ఇంటి ప్రవేశ ద్వారం నుండి పూజ గది వరకు బియ్యప్పిండితో లక్ష్మీదేవి పాదముద్రలు వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి స్థిర నివాసం ఉంటుంది. సాయంత్రం దీపారాధన: సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు శుభ్రం చేసుకుని గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించడం వల్ల అష్ట దరిద్రాలు తొలగి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది.

6 / 6
వాస్తు దోషాల నివారణ: ఇంటి ఈశాన్యం మూలన కొంచెం కళ్ళు ఉప్పును ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగి ఐశ్వర్యం పెరుగుతుంది.

ఆహార నియమాలు: లక్ష్మీ పంచమికి ఒక రోజు ముందు పెరుగు అన్నాన్ని (ఉప్పు లేనిది) తినాలి. పంచమి రోజున మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి లేని ఆహారాన్ని తీసుకోవాలి.

వ్యాపార అభివృద్ధి: వ్యాపారం చేసేవారు పసుపు రంగు వస్త్రంలో గోమతి చక్రాలను కట్టి గల్లా పెట్టెలో పెట్టుకుంటే నష్టాలు లేకుండా అధిక లాభాలు కలుగుతాయి.

ఈ లక్ష్మీ పంచమి రోజున కనకధారా స్తోత్రం పఠించడం, ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కట్టుకోవడం, సాంబ్రాణి పొగ వేయడం వంటివి కూడా శుభప్రదమని నమ్ముతారు. శక్తి లేనివారు కనీసం లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించినా శుభం జరుగుతుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉన్నాయి. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

వాస్తు దోషాల నివారణ: ఇంటి ఈశాన్యం మూలన కొంచెం కళ్ళు ఉప్పును ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగి ఐశ్వర్యం పెరుగుతుంది. ఆహార నియమాలు: లక్ష్మీ పంచమికి ఒక రోజు ముందు పెరుగు అన్నాన్ని (ఉప్పు లేనిది) తినాలి. పంచమి రోజున మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి లేని ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాపార అభివృద్ధి: వ్యాపారం చేసేవారు పసుపు రంగు వస్త్రంలో గోమతి చక్రాలను కట్టి గల్లా పెట్టెలో పెట్టుకుంటే నష్టాలు లేకుండా అధిక లాభాలు కలుగుతాయి. ఈ లక్ష్మీ పంచమి రోజున కనకధారా స్తోత్రం పఠించడం, ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కట్టుకోవడం, సాంబ్రాణి పొగ వేయడం వంటివి కూడా శుభప్రదమని నమ్ముతారు. శక్తి లేనివారు కనీసం లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించినా శుభం జరుగుతుంది. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉన్నాయి. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Follow Us