
సూర్యుడు, కుజుడు వంటి గ్రహాల సంచారాలు, వాటి పరస్పర సంయోగాలు జ్యోతిష్యంలో ముఖ్యమైన ప్రభావాలను చూపుతాయి. త్వరలో సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే సమయంలో కుజుడు కూడా మేషరాశిలోకి చేరడం వల్ల శక్తివంతమైన “కుబేర యోగం” ఏర్పడనుంది. ఈ యోగం సంపద, విజయాలకు సూచికగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా మేష, సింహ, ధనుస్సు, తుల రాశుల వారికి ఇది అనుకూల ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

మేషరాశి.. మేషరాశి వారికి ఈ యోగం వల్ల అదృష్టం బలంగా ఉంటుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగి, పనులను నిర్భయంగా ముందుకు తీసుకెళ్తారు. ఆదాయం పెరగడంతో పాటు, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది.

సింహరాశి.. సింహరాశి వారికి ఆర్థిక లాభాలు పెరుగుతాయి. దీర్ఘకాలంగా అనుకున్న యాత్రలు, ముఖ్యంగా తీర్థయాత్రలు చేయడానికి అనుకూల సమయం. రోజువారీ జీవితంలో సంతోషకరమైన మార్పులు కనిపిస్తాయి.

ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి వారికి అవసరాలు తీరే సమయం ఇది. వ్యాపారంలో ఉన్న నష్టాలు తగ్గి, లాభాలు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా గడపగలుగుతారు.

తులారాశి.. తులరాశి వారికి ఈ యోగం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడి, వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

కుబేర యోగం అంటే ఏమిటి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుబేర యోగం అత్యంత శుభప్రదమైన యోగాలలో ఒకటి. ఇది సంపద, ఐశ్వర్యం, ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తుందని నమ్మకం. ఈ యోగం ఉన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. అకస్మిక ఆర్థిక లాభాలు, వ్యాపార వృద్ధి వంటి శుభఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)