
వృషభం: చతుర్థ, దశమాధిపతులైన రవి, కుజులు అనుకూల రాశుల్లోకి మారడం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరిగే అవకాశం ఉంది. ఒక సంస్థకు అధిపతి అయ్యే సూచ నలు కూడా ఉన్నాయి. రాజకీయ, ప్రభుత్వ ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి.. రాజ పూజ్యాలు, గౌరవమర్యాదలు పెరిగి ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందడం జరుగుతుంది. వీరి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం కూడా ఉంది.

కర్కాటకం: రవి, కుజుల మార్పుతో ధన, పంచమ స్థానాలు బలపడుతున్నందువల్ల కొద్ది ప్రయత్నంతో డిసెంబర్ 9 లోపు ధనవంతుడయ్యే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలను మించి లాభిస్తాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు బాగా పెరుగుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులతో పాటు ప్రముఖులతో పరిచయాలు వీరిని ఉన్నతస్థాయికి తీసుకు వెళ్లే అవకాశం ఉంది. ధన యోగాలతో పాటు వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టడానికి కూడా అవకాశం ఉంది.

సింహం: ఈ రాశిలో కుజుడు, చతుర్థ స్థానంలోరవి ప్రవేశించడం వల్ల కార్తీక మాసమంతా ఈ రాశివారికి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరిగే అవకాశం ఉంది. రాజ కీయ ప్రాబల్యం వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. సామాజిక కార్య క్రమాల ద్వారా వెలుగులోకి రావడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం కలిగి, ప్రాధాన్యం, ప్రాబల్యం పెరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి.

తుల: ఈ రాశికి ధన స్థానంలో రవి, లాభ స్థానంలో కుజుడి సంచారం వల్ల, కార్తీక మాసంలో ఈ రాశివారి దశ తిరిగే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆస్తి, భూమి, ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. షేర్లు బాగా లాభి స్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడితో పాటు, ఆశించిన గుర్తింపు లభిస్తుంది.

వృశ్చికం: ఈ రాశిలో రవి, రాశ్యధిపతి కుజుడు దశమ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల కార్తీక మాసంతో ఈ రాశివారికి ఉద్యోగపరంగా మహర్దశ మొదలవుతుంది. ఏ రంగంలో ఉన్నా అంద లాలు ఎక్కడం జరుగుతుంది. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. కీలక వ్యాపార ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. గౌరవ మర్యాదలు విస్తరిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది.

కుంభం: సప్తమ స్థానంలోకి కుజుడు, దశమ స్థానంలోకి రవి ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశికి చెందిన ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. సంపద బాగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో, రాజకీయ ప్రముఖులతో సాన్నిహిత్యం వృద్ధి చెందుతుంది. వీరి సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది.. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఒకటి రెండు ధన యోగాలు పడతాయి.