Money Astrology: వారికి కాలసర్ప దోష విముక్తి.. ఆర్థికంగా శీఘ్ర పురోగతి..!

Edited By:

Updated on: Jul 06, 2026 | 5:52 PM

Kaal Sarp Dosh Ends: శుక్రుడు సింహరాశిలో ప్రవేశించి కేతువుతో కలవడంతో కాలసర్ప దోష భంగం ఏర్పడింది. దీంతో కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు తగ్గి, పలు సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

1 / 7
కొంత కాలంగా గ్రహాలన్నీ రాహు కేతువుల మధ్య సంచారం చేస్తున్నందువల్ల  కాలసర్ప దోషం కలిగింది. సాధారణంగా కాలసర్ప దోషం వల్ల ప్రతికూల ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తుంటాయి. తాడే పామై కరిచిందన్నట్టుగా ఉంటుంది. అయితే, జూలై 4న శుక్రుడు సింహ రాశిలో ప్రవేశించి అక్కడ ఉన్న కేతువుతో కలవడంతో కాలసర్ప దోషం భంగం అయింది. దీనివల్ల కొన్ని రాశుల వారికి కాలసర్ప దోష దుష్ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది. కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశుల వారికి దోష భంగం కలిగినందువల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది.

2 / 7
కర్కాటకం: ఈ రాశికి ధన, అష్టమ స్థానాల్లో రాహుకేతువుల సంచారం వల్ల కాలసర్ప దోషం కలిగింది. దీని వల్ల వైఫల్యాలు, అడ్డంకులు, ఆలస్యాలు, ఆటంకాలు, అనారోగ్యాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. ధనస్థానంలో ఉన్న కేతువుతో శుక్రుడు కలవడంతో ఈ దోషం పూర్తిగా తొలగిపోయి. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ తేలికగా పూర్తవుతాయి. ఆర్థికంగా శీఘ్ర పురోగతి ఉంటుంది. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది. సుఖ సంతోషాలు, ఆదాయం మళ్లీ పెరుగుతాయి.

3 / 7
సింహం: ఈ రాశిలో కేతువు, సప్తమ స్థానంలో రాహువు సంచారం వల్ల ఈ రాశివారికి పూర్తి స్థాయిలో కాల సర్ప దోషం కలిగింది. ఈ దోషం వల్ల ఈ రాశివారిలోని ప్రతిభా పాటవాలు మసకబారడం, ఉద్యో గంలో ప్రాధాన్యం, ప్రాభవం తగ్గిపోవడం, పదోన్నతులు ఆగిపోవడం, దుర్వార్తలు ఎక్కువగా వినడం వంటివి జరుగుతాయి. ఈ రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ దోషం పరిహారం అవుతుంది. ఫలితంగా ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు బాగా జోరందుకుంటాయి..

4 / 7
వృశ్చికం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాహువు, దశమ స్థానంలో కేతువు సంచారం వల్ల కాలసర్ప దోషం ఏర్పడింది. దీనివల్ల వీరికి ఉద్యోగంలో మానసిక, శారీరక ఒత్తిడి బాగా పెరుగుతుంది. పని భారం ఎక్కువగా ఉంటుంది. ఆశించిన గుర్తింపు లభించకపోవచ్చు. ఆదాయ వృద్ధి స్తంభించిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన కలిసి రావు. శుక్రుడు సింహ రాశిలో ప్రవేశించడంతో ఈ దోషం తగ్గి, పెరుగుదల, ఎదుగుదల ప్రారంభం అవుతాయి. ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది.

5 / 7
మకరం: ఈ రాశికి ధన స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో కేతువు సంచారం వల్ల కాలసర్ప దోషం కలిగింది. దీనివల్ల ఆదాయం కంటే ఖర్చులు పెరగడం, రావలసిన డబ్బు రాకపోవడం, జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురికావడం, కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గడం, దుర్వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. శుక్రుడు కేతువుతో కలవడం వల్ల కాలసర్ప దోషం భంగమైంది. ఈ రాశివారికి ఇక నుంచి ఆదాయపరంగా, కుటుంబపరంగా  అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

6 / 7
కుంభం: ఈ రాశిలో రాహువు, సప్తమ స్థానంలో కేతువు సంచారం వల్ల ఈ రాశికి కాలసర్ప దోషం కలిగింది. దీనివల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గడం, ప్రతిభా పాటవాలు వెలుగులోకి రాకపోవడం, ప్రతి అవకాశమూ చేజారిపోవడం, ఇష్టమైన బంధుమిత్రులు దూరం కావడం, జీవిత భాగస్వామి అనారోగ్యంతో ఇబ్బంది పడడం వంటివి జరుగుతాయి. కాలసర్ప దోష భంగం వల్ల పరిస్థితులు మెరు గుపడడం జరుగుతుంది.. ఉద్యోగంలో పదోన్నతి లభించడం, ఆదాయం పెరగడం వంటివి జరుగుతాయి.

7 / 7
మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో రాహువు, షష్ట స్థానంలో కేతువు సంచారం వల్ల పూర్తి స్థాయిలో కాల సర్పదోషం కలిగింది. దీనివల్ల నమ్మకద్రోహాలు జరగడం, మిత్రుల వల్ల నష్టపోవడం, ఇష్టమైన బంధుమిత్రులు దూరం కావడం, ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడం, అనారోగ్యాలు ఇబ్బంది పెట్టడం జరిగే అవకాశం ఉంది. అయితే, శుక్రుడి సింహరాశి ప్రవేశంతో పరిస్థితులు మారి, ఈ రాశివారు క్రమంగా అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.

Follow Us