Lucky Zodiac Signs: శుభ గ్రహాల యుతి.. అదృష్టవంతులు కాబోయే రాశులివే..!

Edited By:

Updated on: May 06, 2026 | 5:59 PM

Telugu Astrology: మే 15 నుంచి జూన్ 1 వరకు మిథున రాశిలో శుభ గ్రహాలు గురు–శుక్రుల యుతి (Guru - Shukra Yuti) సంభవించనుంది. దీని ప్రభావంతో వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి అదృష్టం బలంగా కలిసివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తక్కువ శ్రమతోనే ఆదాయం పెరగడం, సమస్యల నుంచి ఉపశమనం లభించడం సాధ్యమవుతుంది.

1 / 7
ఈ నెల(మే) 15 నుంచి జూన్ 1వ తేదీ వరకు మిథున రాశిలో గురు, శుక్ర గ్రహాల యుతి జరుగుతోంది. ఈ రెండు శుభ గ్రహాల యుతి వల్ల కొన్ని రాశుల వారు బాగా అదృష్టవంతులయ్యే అవకాశం ఉంది. దీనివల్ల వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరికి కొద్ది ప్రయత్నంతో ఆదాయం పెరగడంతో పాటు అనేక సమస్యలు, ఇబ్బందుల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. రాక్షస గురువు శుక్రుడు, దేవతల గురువు బృహస్పతి కలవడంవల్ల ఇవి పోటీ పోటీగా ధన వృద్ధి, కార్యసిద్ధి కలిగించే అవకాశం ఉంది.

2 / 7
వృషభం: ధన స్థానంలో శుక్ర, గురువుల యుతి వల్ల ఈ రాశివారి జీవితంలో వృత్తి, ఉద్యోగాలపరంగా కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడంతో పాటు విశేషంగా ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. పేరు ప్రఖ్యాతులు బాగా వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

3 / 7
మిథునం: ఈ రాశిలో గురు, శుక్రులు కలవడం వల్ల ఈ రాశివారికి సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు, ఆదాయ వృద్ధి వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆస్తులు సమకూర్చుకోవడం, ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం కావడం, ఆస్తుల విలువ పెరగడం వంటివి జరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి.

4 / 7
సింహం: లాభ స్థానంలో శుక్ర, గురు గ్రహాల కలయిక వల్ల ఈ రాశివారికి అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. ఆస్తిపాస్తుల అభివృద్ధికి ఏ కొద్ది ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి, జీతాల పెరుగుదల వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచిఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి.

5 / 7
తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న శుక్ర, గురువులు కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల దిశగా దూసుకు పోతాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు, స్పెక్యులేషన్లు కనక వర్షం కురిపిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి నిశ్చయం కావడం గానీ జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు సానుకూలపడతాయి.

6 / 7
ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో రాశ్యధిపతి గురువుతో శుక్రుడు కలవడం వల్ల కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనేక ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు లాభదాయక ఉద్యోగాలు లభిస్తాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు వేతనాలు బాగా వృద్ధి చెందుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గిపోతాయి.

7 / 7
కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో రెండు శుభ గ్రహాలు కలవడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కీలక మైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఏలిన్నాటి శని ప్రభావం దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి. శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలావరకు విముక్తి కలుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన శుభవార్త వింటారు.

Follow Us