Money Astrology: గురువును వీక్షిస్తున్న కుజుడు..ఇక ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!

Edited By:

Updated on: Jun 08, 2026 | 5:54 PM

Jupiter and Mars Aspect: కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుపై మేష రాశి నుంచి కుజుడి వీక్షణం జరుగుతోంది. ఈ ప్రత్యేక గ్రహయోగం జూన్ 20 వరకు కొనసాగనుంది. కుజుడు–గురు పరస్పర కేంద్ర స్థానాల్లో ఉండడం వల్ల ఈ సమయం చాలా శుభప్రదంగా భావించబడుతోంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆదాయం పెరగడం, అధికార లాభాలు కలగడం, ఆర్థిక సమస్యలు తగ్గడం వంటి ఫలితాలు కనిపించవచ్చు.

1 / 7
ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువును తన స్వస్థానమైన మేష రాశి నుంచి కుజుడు వీక్షించడం జరుగుతోంది. ఈ వీక్షణ ఈ నెల (జూన్) 20 వరకు కొనసాగుతుంది. మిత్ర గ్రహాలైన కుజ, గురువులు ఒకరికొకరు కేంద్ర స్థానాల్లో (4, 10) ఉండడమే ఒక విశేషం కాగా కుజుడు ఈ గురువును వీక్షించడం మరొక విశేషం. దీనివల్ల మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి ఆదాయం పెరగడం, అధికారం లభించడం, కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం, వివాదాలు సమసిపోవడం వంటివి తప్పకుండా జరుగుతాయి.

2 / 7
మేషం: రాశ్యధిపతి కుజుడు చతుర్థ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువును వీక్షించడం వల్ల ఈ రాశివారికి రాజయోగాలతో పాటు ధన యోగాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్ప కుండా అధికారయోగం కలుగుతుంది. ఆకస్మిక ధన లాభం, అప్రయత్న ధన ప్రాప్తి వంటివి అను భవానికి వస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల కల సాకారమవుతుంది.

3 / 7
మిథునం: ఈ రాశికి ధన స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువును లాభ స్థానం నుంచి కుజుడు వీక్షించడం వల్ల మహా భాగ్య యోగం పట్టే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరగడంతో పాటు జీతభత్యాలు, అదనపు రాబడి కూడా బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అప్రయత్న ధన లాభం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. అనేక విధాలుగా సంపద వృద్ధి చెందుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశముంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

4 / 7
కర్కాటకం: ఈ రాశికి అత్యంత శుభులైన కుజ, గురువులు ఒకరికొకరు కేంద్రంలో ఉండడం, గురువును కుజ గ్రహం వీక్షించడం వల్ల ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. విలువైన ఆస్తి కలిసి వస్తుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలకు భారీగా పెట్టుబడులు అందుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం వరిస్తుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో హోదా పెరుగుతుంది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.

5 / 7
తుల: ఈ రాశికి దశమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువును కుజుడు వీక్షించడం వల్ల ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగం మారే ప్రయత్నాలు ఘన విజయం సాధిస్తాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఊహించని అదృష్టాలు పడతాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు తరచూ వెళ్లే అవకాశం కలుగుతుంది. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి.

6 / 7
వృశ్చికం: భాగ్య స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువును రాశ్యదిపతి కుజుడు స్వస్థానం నుంచి వీక్షించడం వల్ల ఆదాయపరంగా శుభ యోగాలు చోటు చేసుకుంటాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి సంబంధం కుదరడం గానీ జరుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. బాగా విలువైన ఆస్తి కలిసి వస్తుంది.

7 / 7
మీనం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న కుజుడు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న రాశ్యధిపతి గురువును చూడడం వల్ల ప్రభుత్వ మూలక ధన లాభం, గుర్తింపు పొందడం జరుగుతుంది. భూలాభం కలుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు ప్రకాశిస్తాయి. కొద్ది ప్రయత్నంతో వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి కూడా ఊహించని అదృష్టం పడుతుంది.

Follow Us