గ్రహాలు పగబట్టాయేమో.. ఈ నాలుగు రాశుల వారికి కష్టకాలమే..

Updated on: Jun 02, 2026 | 5:55 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే జూన్ నెల ప్రారంభం అయ్యింది. ఇక ఈ మాసంలో చాలా గ్రహాలు కదలికలు జరపడమే కాకుండా, రాశి, నక్షత్ర సంచారం చేయనున్నాయి. అయితే దీని వలన ఈ నెలలో నాలుగు రాశుల వారికి అనేక ఇబ్బందులు ఎదురు కానున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
వృషభ రాశి : జూన్ నెల ప్రారంభం నుంచే వృషభ రాశి వారికి ఒత్తిడి పెరగడం ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు తమ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఉద్యోగం మార్పు గురించి ఆలోచిస్తున్నట్లు అయితే ఒకటికి రెండు సార్లు ఆచీతూచీ అడుగు వేయడం మంచిది. కోర్టు సంబంధిత వ్యవహారాలు వాయిదా పడతాయి.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారు జూన్ నెలలో ఎంత ఓపిక పడితే అంత మంచిది. లేకపోతే అనేక ఇబ్బందులు  ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సమస్యలు అధికం అవుతాయి. మానసిక ఆందోళనలు అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి. అందువలన చాలా వరకు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి.

3 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి అవమానకర సంఘటనలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉంది. అందువలన చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబం సమస్యలు ఎక్కువ బాధిస్తాయి. చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఈ నెల మొత్తం ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తాయి. అందువలన చాలా వరకు ఆచీ తూచి అడుగు వేయండి.

4 / 5
కన్యా రాశి : కన్యారాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఆసుపత్రిల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇంటిలో సమస్యలు అధికం అవుతాయి. మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. అనారోగ్య ఇబ్బందుల వలన ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us