Telugu Astrology: శ్రమ తక్కువ.. లాభం ఎక్కువ! ఇక ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..

Edited By:

Updated on: Jul 04, 2026 | 1:51 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం తృతీయ స్థానం ధైర్యం, ప్రయత్నం, సాహసం, పురోగతికి సూచికగా భావిస్తారు. ప్రస్తుత గ్రహ సంచారం ప్రభావంతో జూలై నెలలో మేషం, వృషభం, మిథునం, ధనుస్సు, మకరం, మీన రాశుల వారికి కెరీర్, వ్యాపారం, వ్యక్తిగత జీవితంలో ఆశించిన పురోగతి, విజయావకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి.

1 / 7
జ్యోతిష శాస్త్రంలో తృతీయ స్థానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది ప్రయత్నానికి, తెగువకు, చొర వకు, సాహసానికి సంబంధించిన స్థానం. ఈ స్థానం బలంగా ఉన్నపక్షంలో ఆ జాతకుడు తప్పకుండా జీవితంలో శీఘ్ర పురోగతి చెందడం జరుగుతుంది. ఈ స్థానం బలహీనంగా ఉన్న పక్షంలో అటువంటి జాతకుల జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. ఈ స్థానాన్ని బట్టే జాతకుడు ఏ స్థాయిలో, ఏ విధంగా జీవితంలో అభివృద్ధి చెందేదీ అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి మేషం, వృషభం, మిథునం, ధనుస్సు, మకరం, మీన రాశులకు జూలై నెలంతా ఆశించిన పురోగతి ఉంటుంది.

2 / 7
మేషం: ఈ రాశికి తృతీయ స్థానంలో ప్రస్తుతం రవి, 7 తర్వాత బుధుడి సంచారం వల్ల ఏ విషయంలోనైనా దూకుడుగా, చొరవగా వ్యవహరించడం జరుగుతుంది. వీరు ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజ యవంతం అవుతుంది. తప్పకుండా అంచనాలను మించిన పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో సక్సెస్ అవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారం చేపట్టడానికి, మంచి సంస్థల్లోకి మారడానికి, ఉద్యోగం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. పోటీదార్ల మీద విజయాలు సాధిస్తారు.

3 / 7
వృషభం: ఈ రాశివారికి 3వ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల ఎటువంటి ప్రయ త్నమైనా విజయవంతం అవుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఉత్తమ ఫలితాల్ని సాధిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పోటీ పరీక్షల్లో ఎంపిక అవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి.

4 / 7
మిథునం: ఈ రాశికి ఈ నెల 4 నుంచి శుక్రుడు తృతీయ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల ఈ నెలంతా ఈ రాశివారు ఎలాంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతమవుతుంది. అనుకున్న పనులన్నీ పూర్త వుతాయి. తమకు సంబంధించిన రంగం మీద పూర్తిగా దృష్టి పెడతారు. నైపుణ్యాలను, ప్రతిభను పెంచుకుంటారు. ముఖ్యంగా ఆర్థిక పురోగతి అత్యధికంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కా రమవుతాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతాయి. షేర్లు బాగా లాభిస్తాయి.

5 / 7
ధనుస్సు: ఈ రాశివారికి 3వ స్థానంలో రాహువు సంచారం వల్ల ఈ రాశివారికి శ్రమ తక్కువ లాభం ఎక్కు వగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సీనియర్లతో పోటీపడి విజయం సాధించి అందలాలు ఎక్కుతారు. ఈ రాశివారికి పురోగతి అనేది ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యో గాల్లో విశేషమైన అభివృద్ధి కనిపిస్తుంది. అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది.

6 / 7
మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో రాశ్యధిపతి శనీశ్వరుడి సంచారం వల్ల ఈ రాశివారు పట్టుదలగా అనేకం సాధించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు, ఆదాయ వృద్ధి, వృత్తి, వ్యాపారాల అభివృద్ధి వంటి వాటి మీద వీరు ఎక్కువగా కృషి చేసి సక్సెస్ అవుతారు. ఉద్యోగులకే కాకుండా నిరుద్యోగులకు సైతం అవకాశాలు, ఆఫర్లు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో అతి వేగంగా పురోగతి ఉంటుంది. ఉన్నత స్థాయి వారితో పరిచయాలు పెరుగుతాయి.

7 / 7
మీనం: ఈ రాశికి తృతీయ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఆదాయ వృద్ధిలో వీరు సాటివారి కంటే బాగా ముందుంటారు. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు విజ యవంతం అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాల్లో భాగస్వాములతో విభేదాలను పూర్తిగాపరిష్కరించుకుంటారు.

Follow Us