
చాలా మంది ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు అంటారు. ఏ ఇంటిలో ఆడపిల్ల చాలా ఆనందంగా, నవ్వుతూ తిరుగుతుందో ఆ ఇంటిలో డబ్బుకు కొదవ ఉండదు, అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు. అందుకే చాలా వరకు ఆడపిల్ల జన్మించడం చాలా మంచిది అంటారు. అయితే ఇంట్లో ఆడపిల్ల జన్మించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.

ఎవరి ఇంటిలో అయితే ఆడపిల్ల జన్మిస్తుందో వారికి చంద్ర, శుక్ర గ్రహాల బలం వస్తుంది. అంతే కాకుండా రెండు గ్రహాల అనుగ్రహం కూడా లభిస్తుందంట. ముఖ్యంగా ఏ ఇంటిలో అయితే ఆడపిల్ల జన్మిస్తుందో, ఆ ఇంటిలో క్రమంగా, ఆ చిన్నారి పెరిగి పెద్ద అయ్యే కొద్దీ, సానుకూలత పెరగడమే కాకుండా సంపద కూడా పెరుగుతుంది. ముఖ్యంగా తండ్రికి కెరీర్ పరంగా కలిసి వస్తుందంట. అంతే కాకుండా మొదటి సంతానం ఆడపిల్ల పుట్టడం వలన సాక్ష్యాత్తు లక్ష్మీదేవే ఇంటిలోకి వచ్చిదని నమ్ముతారు. అలాగే మొదట ఆడపిల్ల పుట్టడం వలన ఆ ఇంటి వారికి ధనానికి ధన్యానికి లోటే ఉండదంట.

శుక్ర గ్రహం అనుగ్రహం కలిగి ఆ ఇంటిలో సంతోషం, డబ్బుకు కొదవే ఉండదంట. కూతురు పుట్టిన తర్వాత ఆ తల్లిదండ్రుల జీవితం మారిపోవడమే కాకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే మొదటి సంతానం ఆడపిల్ల జన్మించడం చాలా మంచిదంట.

జన్మించడమే కాకుండా ఆ ఆడపిల్లను కన్యాదానం చేస్తారు తల్లిదండ్రులు. ఇది చాలా మంచిదంట. కన్యాదానం చేయడం వలన ఏడు తరాల వారికి మోక్షం లభిస్తుంది అంటారు. హిందూ ధర్మంలో కన్యాదానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్క కన్యాదానం చేయడం వంద యజ్ఞాలను చేసి ఫలితం ఇస్తుందంట. అందువలన ఆడపిల్ల జన్మించినప్పుడు, తాను పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్లినప్పుడు కూడా తన తల్లిదండ్రులకు మేలు చేస్తుంది. అందువలన ఆడ పిల్లలు జన్మించడం చాలా మంచిదంట. ఇది తల్లిదండ్రులకు చాలా శుభ సూచకం అని చెబుతున్నారు పండితులు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు