
మేష రాశి : మేష రాశి అమ్మాయిలు చాలా ఫైర్ అయ్యే వ్యక్తులు. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఎవరిపైనా అయినా విరుచుకుపడే స్వభావం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ రాశిలో జన్మించిన అమ్మాయిల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు.

సింహ రాశి : సింహ రాశి వారు ప్రతీది చాలా నెగటివ్ తీసుకునే స్వభావం కలవారు. వీరు ఎప్పుడూ ఇతరులతపై విరుచుకుపడుతారు. ముఖ్యంగా గ్రహాల ప్రభావం ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు చాలా మొండిగా, అందరిపై విరుచుకుపడే స్వభావం కలిగి ఉంటారు.

మకర రాశి : మకర రాశి వారికి సహజంగానే చాలా కోపం ఉంటుంది. వీరు తన మనసు బాలేకపోయినా, ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కున్నా ఇతరులపై మండిపోతారు. అంతే కాకుండా చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. అందుకే ఈ రాశి వారితో గొడవ పెట్టుకోవడానికి ఎవరూ ఇంట్రస్ట్ చూపరు.

కుంభ రాశి : కుంభ రాశిలో పుట్టిన వారు చాలా శాంత స్వరూపులు, కానీ వీరికి కోపం వచ్చిందంటే చాలు ఉగ్రరూపం దాల్చుతారు. వీరు ప్రతి ఒక్కరూ సౌమ్యంగా ఉడాలి అనుకుంటారు. కానీ కొన్ని సార్లు వీరే చాలా కోపంగా ఉంటారు. అంతే కాకుండా అవసరం అయితే పోట్లాటకు కూడా దిగే స్వభావం ఉంటుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు