
దీపావళి పండుగ సమయంలో ఏర్పడే ఈ యోగాల వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే కానుంది. ముఖ్యంగా బుధుడు, శుక్రుడు, ఇలా వివిధ గ్రహాల అనుకూలతల వలన రాజయోగం పట్టనుంది. కాగా, ఈ పండుగ ఎవరి జీవితంలో కొత్త వెలుగులు తీసుకొస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి చాలా దీపావళి నుంచి రాజయోగం పట్టనుంది. ఊహించని విధంగా ప్రయోజనాలు కలుగుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. శుక్రుడి అనుగ్రహం వలన చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, వారికి ఇది చాలా బెస్ట్ సమయం అని చెప్పాలి.

సింహ రాశి : సింహ రాశి వారికి ఇది చాలా మంచి సమయం. దీపావళి తర్వాత నుంచి వీరు అనుకున్న పనులు నెరవేర్చుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు ఎక్కువ మొత్తంలో డబ్బును సంపాదించుకుంటారు.

మేష రాశి : మేష రాశి వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అనుకోని విధంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ సమయంలో స్థిరాస్తి లేదా నూతన వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.

మీన రాశి : మీన రాశి వారికి పట్టింది బంగారమే కానుంది. వీరు ఊహించని విధంగా ప్రయోజనాలు అందుకుంటారు. ప్రతి పనిలో విజయం వీరిదే అవుతుంది. దూర ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. అన్ని విధాలుగా వీరికి ఇది అద్భుతమైన సమయం. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.