
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే దీపావళి పండుగకు ముందు కేతువు, గురు గ్రహాల కలయిక, గురు సంచారంతో ధ్వజో యోగం ఏర్పడనుంది. దీని వలన దీపావళి పండుగ సమయంలో నాలుగు రాశుల వారికి అద్భుతంగా కలిసి రానుంది. ఆదాయం పెరగనుంది. అంతే కాకుండా కొందరు అనుకోకుండా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉన్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

సింహ రాశి : మీ రాశిలోనే ఈ యోగం ఏర్పడుతుండటం వల్ల ఇది మీకు బంపర్ లాటరీ లాంటిది. గత కొన్ని నెలలుగా ఆగిపోయిన పనులన్నీ ఒక్కసారిగా పూర్తవుతాయి. పూర్వీకుల ఆస్తి ద్వారా భారీ ధనలాభం, వ్యాపారంలో ఊహించని ఆర్డర్లు వస్తాయి. ఉద్యోగులకు దీపావళి బోనస్ తో పాటు ప్రమోషన్ ఖాయం. మీరు దీపం వెలిగించే లోపే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది.

మేష రాశి : మేష రాశి వారికి ధ్వజో యోగం వల్ల అదృష్టం తలుపు తడుతుంది. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో మీకంటూ ప్రత్యేక స్థానం లభిస్తుంది. అన్ని విధాలుగా ఇది మీకు కలిసి వచ్చే సమయం. అనుకోకుండా ఈ రాశుల వారు కోటీశ్వరులు అవుతారు

కుంభ రాశి : కుంభ రాశి వారికి ధ్వజ యోగం వల్ల వ్యాపారం కలిసి వస్తుంది. విదేశీ డీల్స్, కొత్త క్లయింట్స్ ద్వారా కోట్లలో లాభం వచ్చే అవకాశం ఉంది . అన్ని విధాలుగా ఆదాయం సమకూరుతుంది. దాంపత్య జీవితంలో ఆనందంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి సహాయం అందుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం వచ్చే యోగం బలంగా ఉంది.

తుల రాశి :తుల రాశి వారికి 11వ స్థానం అంటే లాభ స్థానంలో ఈ యోగం ఏర్పడుతోంది. ఇది మీకు కోటీశ్వరులయ్యే ఛాన్స్. ఎక్కడి నుంచో రావాల్సిన డబ్బు, ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది. మీ ఆదాయం ఒక్కసారిగా 3 రెట్లు పెరుగుతుంది. కొత్త ఇల్లు, కొత్త వాహనం కొనే యోగం ఈ దీపావళికే ఉంది