
జ్యోతిష్య శాస్త్రంలో సాముద్రిక శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీని ప్రకారం చాలా మంది ఒక వ్యక్తి శరీరాకృతి బుగ్గపై ఉండే సొట్ట ఆధారంగా వారి వ్యక్తిత్వం మాత్రమే కాకుండా వారి అదృష్టాన్ని కూడా తెలియజేస్తుందని చెప్పుకొస్తుంటారు. కాగా, ఇప్పుడు మనం బుగ్గపై సొట్ట ఉండటం అదృష్టమా? దురదృష్టమా తెలుసుకుందాం.

సాముద్రిక శాస్త్రం ప్రకారం బుగ్గపై సొట్ట ఉండటం చాలా అదృష్టం అని చెబుతున్నారు పండితులు. నవ్వినప్పుడు బుగ్గపై సొట్ట పడటం చాలా ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నదంట. ఇది అందాన్ని పెంచడమే కాకుండా వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. అలాగే వారికి వ్యక్తిత్వాన్ని కూడా తెలియజేస్తుందంట. ఇలాంటి వారు చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఎక్కడ ఉన్నా, తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు.

అలాగే బుగ్గపై సొట్టపడే వ్యక్తులు చాలా సున్నితమైన, సౌమ్యమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందరితో చాలా అద్భుంతంగా మాట్లాడటమే కాకుండా, ప్రతి ఒక్కరినీ తమ మాటలు, నవ్వు, అందంతో ఆకట్టుకుంటారు. వీరు ఏది కోరకుంటారో, దానిని సాధించే వరకు నిష్క్రమించకుండా పోరాడి దానిని గెలుస్తారు.

సాముద్రిక శాస్త్రం ప్రకారం, చెంపలపై గుంటలు ఉండే వ్యక్తులు చాలా అదృష్టవంతులు, ఇది వారి అదృష్టానికి సంకేతం. ఒక శుభ సూచకం అంట. ఇలాంటి వ్యక్తులకు జీవితంలో అనేక మంచి అవకాశాలు లభించడమే కాకుండా, జీవితంలో మంచి పురోగతి సాధిస్తారంట, అన్ని రకాలుగా వీరికి లక్కు అనేది కలిసి వస్తుందని చెబుతున్నారు నిపుణులు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు