
డిసెంబర్ గ్రహ సంచారం ప్రకారం కొన్ని రాశుల వారికి దశమ స్థానం, అంటే ఉద్యోగ స్థానం బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అవకాశాలు లభించడం, ఉద్యోగులకు డిమాండ్ పెరగడం, ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకోవడం, ఉద్యోగంలో స్థిరత్వం లభించడం, ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలం కావడం వంటివి ఈ రాశుల వారికి జరిగే అవకాశముంది. ప్రభుత్వ, విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నవారికి కూడా నెలాఖరులోగా ఉద్యోగం లభించే సూచనలున్నాయి. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకర రాశులకు ఉద్యోగ సంబంధమైన ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది.

వృషభం: ఈ రాశికి దశమ స్థానాధిపతి అయిన శని లాభ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి డిసెంబర్ నెల ప్రారంభంలో తప్పకుండా తప్పకుండా ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. శని ప్రైవేట్ రంగానికి కారకుడైనందువల్ల వీరికి ప్రభుత్వోద్యోగాల కంటే ప్రైవేట్ ఉద్యోగాలే లభించే సూచనలున్నాయి. ఈ రాశి నిరుద్యోగులు విదేశీ ఉద్యోగాలకు కూడా ప్రయత్నాలు సాగించడం మంచిది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి ప్రస్తుతానికి అవకాశం ఉండకపోవచ్చు.

మిథునం: ఈ రాశివారికి దశమ స్థానంలో ఉద్యోగ కారకుడైన శనీశ్వరుడి సంచారం వల్ల ఈ రాశివారు ప్రైవేట్ రంగంలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశముంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరగడంతో పాటు రాబడి కూడా బాగా పెరుగుతుంది. వీరు ఏదైనా వ్యాపారంలో ప్రవేశించినా రాణించడం జరుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానాధిపతి అయిన కుజుడు ధన స్థానంలో గురువుతో యుతి చెందడం వల్ల త్వరలో ఈ రాశివారు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ప్రైవేట్ రంగం నుంచే కాక, ప్రభుత్వ రంగం నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఏ రంగం ఉన్నా ఆశించిన పదో న్నతి లభిస్తుంది. ఉద్యోగులకు కూడా ఆఫర్లు అందడం, డిమాండ్ పెరగడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

సింహం: ఈ రాశికి దశమాధిపతి అయిన తృతీయంలో స్వస్థానంలో ఉన్నందువల్ల ప్రభుత్వ ఉన్నతోద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా బాగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. డిసెంబర్ 16 లోపు కొద్ది ప్రయ త్నంతో మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగుల ప్రతిభా పాటవాలకుగుర్తింపు లభిస్తుంది. ఆశించిన జీతభత్యాలు లభించే సూచనలున్నాయి. వ్యాపారాలు కూడా కలిసివస్తాయి.

వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతి అయిన రవి ఇదే రాశిలోనూ, 16 తర్వాత ధన స్థానంలోనూ సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి డిసెంబర్ నెలలో తప్పకుండా ప్రైవేట్ ఉద్యోగం లభిస్తుంది. అయితే, ఈ రాశివారు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధించడం ద్వారా ప్రభుత్వ ఉద్యో గంలో చేరిన తర్వాత వీరికి అతి తక్కువ కాలంలో స్థిరత్వం లభించే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్లవలసిన పరిస్థితి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కూడా కొత్త పుంతలు తొక్కుతాయి.

మకరం: ఈ రాశికి దశమ స్థానంలో దశమాధిపతి శుక్రుడి సంచారం వల్ల ఉద్యోగ జీవితంలో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారి కోరిక నెర వేరుతుంది. అతి తక్కువ కాలంలో భారీ వేతనాలతో ఉద్యోగంలో స్థిరత్వం లభించే సూచనలున్నాయి.