
2026లో చివరి చంద్రగ్రహణం ఆగస్టు 28న ఏర్పడనుంది. ఈ సమయంలో చంద్రుడు శని, కుంభ రాశిలో సంచారం చేయనున్నాయి. అంతే కాకుండా రాహువు శతభిషా నక్షత్రంలో సంచరిస్తున్నారు. అయితే చంద్రుడు, శని గ్రహాల కలయిక వలన కొన్ని రాశులకు దరిద్రం చుట్టుకుంటే, మరొకొన్ని రాశుల వారికి మాత్రం కలిసి వస్తుంది. అయితే ఈ గ్రహణం వలన ఎవరికి లాభమో చూద్దాం.

మేష రాశి : మేష రాశి వారికి చంద్రగ్రహణం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి అనుకున్న పనులు సమయానికి పూర్తి అవుతాయి. ఆదాయం కూడా డబుల్ అవుతుంది. సమాజంలో వీరికంటూ ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఇంటిలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది.

వృషభ రాశి : వృషభ రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఆదాయం కూడా అనుకోని విధంగా పెరగడం, చాలా రోజుల నుంచి మంచి జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి త్వరగా ఉద్యోగం దొరుకుతుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఫ్లాట్ లేదా ల్యాండ్ కొనుగోలు చేయాలి అనుకునే వారి కోరిక నెరవేరుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

తుల రాశి : తుల రాశి వారికి కూడా ఇది చాలా మంచి సమయం. వీరు అనుకున్నది నెరవేర్చుకుంటారు. కోర్టు వ్యవహారాలు వీరికి చాలా వరకు అనుకూలంగా వస్తాయి. పూర్వీకుల నుంచి అందాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. చాలా ఆనందంగా గడుపుతారు. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అన్నివిధాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. గతంలో ఎవరు అయితే పెట్టుబడులు పెట్టారో వారికి ఈ సమయంలో చాలా అద్భుంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే ఛాన్స్ ఉంది. అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది.