
ఈ నెల(ఆగస్టు) 28న, శ్రావణ పౌర్ణమి రోజున కుంభ రాశిలో చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపించనప్పటికీ, ఆ రోజున కుంభ రాశిలో ఉన్న చంద్ర రాహువులకు, సింహ రాశిలో ఉన్న రవి కేతువులకు మధ్య సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల పాక్షికంగా గ్రహణ ఫలితాలు కలుగుతాయి. ఈ గ్రహణ ప్రభావం పక్షం రోజులకు పైగా ఉంటుంది. మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశులకు ధన యోగాలు, రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వినడం, ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం కావడం, ఆదాయం వృద్ధి చెందడం, వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి.

మేషం: ఈ రాశివారికి లాభస్థానంలో చంద్ర గ్రహణం పడుతున్నందువల్ల గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉండక పోవచ్చు. చాలావరకు అనుకూలతలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనేక విధాలా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆశించిన మానసిక ప్రశాంతత లభిస్తుంది.

మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల విదేశాల నుంచి లేదా దూర ప్రాంతాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో సానుకూల స్పందన లభిస్తుంది.. కొత్త ప్రయత్నాలు చేపట్టడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది.

కన్య: ఈ రాశికి షష్ట స్థానంలో గ్రహణం సంభవిస్తున్నందువల్ల సమస్యలు, ఒత్తిళ్లు పూర్తిగా తగ్గు ముఖం పడతాయి. ఆస్తి, ఆర్థిక వివాదాల నుంచి బయటపడతారు. సాధారణంగా ఏ సమస్యా ఉండే అవకాశం లేదు. శత్రువులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆదాయం బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు హ్యాపీగా సాగుతాయి. దూరపు బంధువుల్ని, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

తుల: ఈ రాశికి పంచమ స్థానంలో గ్రహణం సంభవించడం వల్ల ఈ రాశివారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఊహించని విధంగా పురోగతి ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. సోదరు లతో సఖ్యత ఏర్పడుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. అనవసర స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఇతరుల విషయాల్లో తలదూ ర్చవద్దు. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. మనసులోని కోరికలు నెరవేరు తాయి.

ధనుస్సు: ఈ రాశివారికి తృతీయ స్థానంలో గ్రహణం పడుతున్నందువల్ల. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా నూరు శాతం విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి ఇది అనుకూల సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి బాగా లబ్ధి పొందుతారు. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది.

మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారి విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీ దార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. సరైన విధంగా మదుపులు చేయ డం, పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.