
మేషం: ఈ రాశివారికి లాభ స్థానంలో రవి, బుధులు కలిసి బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. కనీవినీ ఎరుగని మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. ఉన్నత పదవులకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా బాగా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఈ వీరి సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. అధికారం చేపట్టడానికి కూడా బాగా అవకాశం ఉంది.

వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం, ఈ రెండు గ్రహాలు ఈ రాశికి అత్యంత శుభ గ్రహాలు కావడం వల్ల జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. తప్ప కుండా అధికార యోగం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పనిచేసే సంస్థలకు వీరి వల్ల లాభం కలుగుతుంది.

మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో రాశినాథుడైన బుధుడితో రవి కలవడం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ఉన్నత పదవులు లభిస్తాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఇంటా బయటా ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. ఎటువంటి వ్యక్తిగత సమస్య అయినా పరిష్కారం అవుతుంది. ఇతరుల సమస్యలను కూడా మధ్యవర్తిత్వంతో, కౌన్సెలింగ్ తో పరిష్కరించడం జరుగుతుంది.

తుల: ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడితో రవి గ్రహం కలవడం వల్ల, ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహ, వాహన సౌకర్యాలు అమరడానికి అవకాశం ఉంది. బాగా ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి సంబంధమైన వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి.

మకరం: ఈ రాశికి ధన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆదాయ వృద్ధికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఆర్థిక సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి. కుటుంబంలో వివాదాలు తొలగిపోయి సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి. అదనపు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో వీరి సలహాలు, సూచనలు అధికారులకు, సంస్థకు బాగా ఉపయోగపడతాయి.

కుంభం: ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడినందువల్ల వీరికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. మేనేజ్మెంట్ లో భాగం కావడం జరుగుతుంది. ప్రాధాన్యం, ప్రాభవం వృద్ధి చెందుతాయి. ఎటువంటి వ్యక్తిగత సమస్యలైనా తేలికగా పరిష్కారం అవుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో హోదా, స్థాయి పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.