
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులకు ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అవి వ్యక్తులపై ప్రభావం కూడా చూపుతాయి. దాని వలన ఆ రాశుల వారు తెలియకుండానే ఇతరులపై అధిపత్యం చలాయించడం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అయితే ఇతరులపై అధిపత్యం చలాయిస్తూ, ప్రత్యేకమైన శక్తి, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండే రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

వృశ్చిక రాశి : అత్యంత శక్తివంతమైన రాశుల్లో వృశ్చిక రాశి కూడా ఒకటి . ఈ రాశి వారు చాలా కష్టపడి పని చేస్తారు అంతే కాకుండా ప్రతి విషయాన్ని చాలా లోతుగా అర్థం చేసుకునే నేర్పు వీరిలో ఉంటుంది. వీరు చాలా వ్యూహాత్మకంగా, గ్రహణ శక్తితో ఉంటారు. అందువలన వీరిని మోసం చేయడం కష్టం, వీరు అన్నింట్లో విజయం సాధిస్తారు. చాలా గొప్పగా జీవిస్తారు.

సింహ రాశి : సింహ రాశి వారు చాలా విభిన్నమైన శక్తిని కలిగి ఉంటారు. అంతే కాకుండా వీరు చాలా ఆకర్షణీయమైన రూపం, అధికారం చలాయించే స్వభావం కలిగి ఉంటారు. ముఖ్యంగా సింహ రాశి శక్తి చాలా గంభీరమైనది, మాయను కలిగి ఉంటుంది. అందువలన ఈ రాశి వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వెంటనే శక్తి మారిపోతది, సంభాషణలు మారిపోతాయి. ప్రతి ఒక్కరిలో భయం మొదలు అవుతుంది. అంతలా వీరిలో శక్తి దాగి ఉంటుంది అని చెబుతున్నారు పండితులు.

మేష రాశి : మేష రాశి సహజ శక్తివంతమైన రాశి. దీని వేగాన్ని తగ్గించడం చాలా కష్టం, అందువలన ఈ రాశి వారు ఎప్పుడూ కూడా అందరికంటే చాలా ముందు ఉంటారు. భయం అనేదే ఉండదు, చాలా ధైర్యం కలవారు, తమకు తామే కొత్త కొత్త మార్గాలను సృష్టించుకుంటూ ముందుకు వెళ్తారు. పోటీ తత్వం, విజయం సాధించాలి అనే భావన చాలా ఎక్కువగా ఉంటుంది.

మకర రాశి : మకర రాశి వారు నిశ్శబ్దంగా ఉంటూనే ఓ ఉప్పెనలా లేస్తారు. వీరికి ఆర్భాటాలకు వెళ్లడం, ఆడంబరంగా ఉండటం అంతగా ఇష్టం ఉండదు. కానీ వీరు చక్కటి క్రమశిక్షణ కలిగి ఉంటారు. సహనం, నిశ్శబ్దంతో పనులు పూర్తి చేసుకుంటారు. వీరు చాలా కష్టపడి పని చేయడమే కాకుండా, చాలా తక్కువ సమయంలోనే ఉన్నత స్థానంలో ఉంటారు. అదేవిధంగా వీరు ఇతరులను ఆకర్షించడమే కాకుండా, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.