
వృషభం: ఈ రాశికి శని, రాహు, కేతువు, కుజ గ్రహాలు ప్రస్తుతం బాగా అనుకూల స్థానాల్లో సంచారం చేస్తు న్నందువల్ల అనేక విధాలుగా జీవితం సానుకూల మార్పులు తిరుగుతుంది. జీవితంలో కొన్ని కీల కమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సరికొత్త ఆదాయ వృద్ధి మార్గాలు అందుబాటు లోకి వస్తాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలమవుతాయి. పట్టిందల్లా బంగారమవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.

మిథునం: ఈ రాశిలో ఉన్న కుజుడు, నవమంలో ఉన్న రాహువు, తృతీయంలో ఉన్న కేతువు, దశమంలో ఉన్న శని ఈ రాశివారి జీవితాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. రెండు మూడు నెలల్లో వీరు విదేశాల్లో ఉద్యోగం, స్థిర నివాసం సంపాదించే అవకాశం కనిపిస్తోంది. వృత్తి, ఉద్యోగాలతో పాటు ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. ఏ కార్యం తల పెట్టినా సఫలమవుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. సంతాన యోగం కలుగుతుంది.

తుల: ఈ రాశివారికి రాహు కేతువులతో జీవితంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. శని వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. కుజుడి వల్ల ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. లాభ స్థానంలోని కేతువు వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం కావడంతో పాటు, ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. సంపన్నులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఉంది.

ధనుస్సు: పాప గ్రహాల పుణ్యమాని ఈ రాశివారికి మహా భాగ్య యోగం పట్టే అవకాశం ఉంది. అర్ధాష్టమ శని ప్రభావం కూడా గురువు దృష్టి వల్ల తొలగిపోవడంతో వీరికి పట్టపగ్గాలు ఉండకపోవచ్చు. తృతీయం లోని రాహువు వల్ల వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి, జీతభత్యాలు బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. భాగ్య స్థానంలోని కేతువు వల్ల విదేశీ అవకాశాలు లభిస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు ఊహించని సత్ఫలితాలనిస్తాయి.

మకరం: ఈ రాశివారికి పాప గ్రహాలన్నీ బాగా కలిసివస్తున్నాయి. కొద్ది రోజుల్లో వీరి సంపాదన పెరగడంతో పాటు సామాజికంగా కూడా హోదా లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. విశేషంగా ఆర్థిక లాభాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఆస్తి లాభం, భూలాభం కలగడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు అంచనాలకు మించిన జీతభత్యాలతో ఉద్యోగం లభిస్తుంది. సంపన్నులతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

మీనం: ఈ రాశివారికి ఏలిన్నాటి శని ప్రభావం తగ్గడంతోపాటు పాప గ్రహాల వల్ల శుభ యోగాలు పట్ట బోతున్నాయి. ఆర్థిక స్థితిగతులు గణనీయంగా మెరుగుపడడం జరుగుతుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా, ఆదాయ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. సిరిసంపదలు వృద్ది చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. పదోన్నతికి, జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది.