2026 చివరి సూర్యగ్రహణం ఎప్పుడు? తేదీ, సమయం, ఇండియాలో కనిపిస్తుందా?

Updated on: May 22, 2026 | 10:35 AM

ప్రతి సంవత్సరం సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఏర్పడటం కామన్. అయితే ఇప్పటికే ఒక సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే అతి త్వరలో రెండవ సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది. అయితే ఇదే 2026లో చివరి సూర్య గ్రహణం. కాగా, ఇది ఎప్పుడు ఏర్పడుతుంది. సమయం, తేదీ, ఇది ఇండియాలో కనిపిస్తుదా? లేదా అనే విషయాలను మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
సూర్యగ్రహణం అనేది చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ, సూర్యునికి, భూమికి మధ్యలో ప్రయాణిస్తాడు. ఈ సమయంలో  సూర్యకాంతి భూమిపై పడకుండా అడ్డుకోవడం జరుగుతుంది. దీనిని సూర్యగ్రహణం అంటారు.  అయితే త్వరలో ఆగస్టు 12న మరో సూర్యగ్రహణం ఏర్పడనుందని ఖగోళ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు.  ఈ సూర్యగ్రహణం ఈ సారి అనేక దేశాల్లో కనువిందు చేయనున్నదంట. అగ్ని వలయం ఆకారంలో ఏర్పడనుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

2 / 5
సైంటిఫిక్‌గానే కాకుండా, ఆధ్యాత్మికంగా కూడా గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది అనేక విషయాలను ప్రభావితం చేస్తుంది. అందుకే చాలా మంది గ్రహణం సమయంలో అనేక నియమాలు పాటిస్తారు. అయితే ఈ సంవత్సరం సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడ బోతుంది అంటే. ఆగస్టు 12 రాత్రి 9.04 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 13న తెల్లవారు జాము 4 గంటల 25 నిమిషాలకు ముగుస్తుంది. ఇండియాలో కనిపించదు, ఇక భారత కాలమానం ప్రకారం రాత్రి సమయంలో సంభవిస్తుంది.

3 / 5
ఈ ఏడాదిలో ఏర్పడే చివరి సూర్య గ్రహణం ఇదే, ఇది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో ఏర్పడటం జరుగుతుంది. ఈ సూర్య గ్రహణం సమయంలో సూర్యుడు అగ్ని వలయంలా, కంకణలా కనిపిస్తాడని నిపుణులు తెలియజేస్తున్నారు.  అయితే చాలా మంది ఇది భారత దేశంలో కనిపిస్తుందా? లేదా అని అనుకుంటారు, అయితే భారత దేశంలో కనిపించదు, ఈ సూర్య గ్రహణం కెనడా, ఐస్లాండ్, ఉత్తర స్పెయిన్, రష్యా ఈశాన్య భాగం , అట్లాంటిక్ మహా సమద్రం చుట్టు పక్కల కనిపిస్తుందంట.

4 / 5
అయితే ఆగస్టు 12న ఏర్పడే సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదు కాబట్టి, దీనికి సూతక్ కాలం వర్తించదు. అందువలన ఇండియాలోని ప్రజలు సూతకకాలం నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు పండితులు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us