డిన్నర్ స్పెషల్.. కారం కారం మటన్ కీమ.. ఎలా చేయాలంటే?

Updated on: Jun 23, 2026 | 7:06 PM

డిన్నర్ స్పెషల్ వంటకం ఏదైనా ఉన్నదా అంటే నోరూరించే మటన్ కీమా చాలా బెస్ట్. దీనిని తెలంగాణ స్టైల్‌లో కాస్త కారం కారంగా చేస్తే, ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. కాగా, ఇప్పుడు మనం మటన్ కీమాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి.

1 / 5
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. ధనియాలు, సోంపు గింజలు, ఎండు మిర్చి, స్టార్ అనాసా, పెద్ద యాలకులు, చిన్న యాలకులు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు వీటితో గరం మసాలా తయారు చేసుకోవాలి. గ్రేవీ కోసం నూనె, జీలకర్ర , బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కారం, పసుపు, మటన్ కీమా అరకిలో, నీరు, పచ్చి బఠానీ, కస్తూరి మేతి.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే.. మటన్ కీమా తయారీ కోసం ముందుగా మసాలా తయారు చేసుకోవాలి. దీని కోసం ధనియాలు, నల్ల మిరియాలు, సోంపు గింజలు వీటన్నింటినీ వేయించి మంచి మసాలా తయారు చేసుకోవాలి. దీనిని మసాలా కర్రీలో వేస్తే చాలు రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.

3 / 5
ఇప్పుడు మటన్ కీమా తయారు చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేయాలి. అందులో నూనె పోసి, నూనె బాగా వేడి అయిన తర్వాత జీలకర్ర, బిర్యానీ ఆకులు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చీ వేసి, మంచిగా వేయించుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత టమాటాలు వేయాలి.

4 / 5
ఇక ఇవి బాగా వేగిన తర్వాత కొత్తిమీర, కొంచెం ఉప్పు, వేయాలి. ఆ తర్వాత అందులో మటన్ కీమా వేయాలి. మటన్ మంచిగా మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. కొన్ని నీళ్లు పోసి మెత్తటి గ్రేవీలా అయ్యే వరకు దీనిని ఉడికించుకోవాలి. దీని వలన రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.

5 / 5
ఇప్పుడు మటన్ బాగా ఉడికిన తర్వాత అందులో గరం మసాలా, కొత్తిమీర అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ మటన్ కీమా రెడీ. ఇది రాత్రి డిన్నర్‌కు చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి.

Follow Us